హోండురస్ ఉత్తర టెలా ఓడరేవు పట్టణంలోని జైల్లో ఖైదీల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో సుమారు 18మంది చనిపోయారని జైలు అధికారులు తెలిపారు. మరో 16మంది గాయపడినట్లు వెల్లడించారు.
హోండురస్ జైల్లో 18 మంది ఖైదీలు మృతి - At least 18 prisoners dead in clash at Honduras jail
మధ్య అమెరికాలోని హోండురస్ ఉత్తర టెలా ప్రాంతంలోని జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 18 మందికి మృతి చెందగా, 16మంది గాయపడ్డారు.
హోండురస్ జైల్లో 18 మంది ఖైదీలు మృతి
ఈ ఘటనతో అప్రమత్తమైన హోండురస్ అధ్యక్షుడు ఓర్లాండో హెర్నాండెజ్ దేశంలోని అన్ని జైళ్లలో భద్రత పెంపునకు ఆదేశించారు. దేశంలోని మొత్తం 27జైళ్లను పోలీసులు, ఆర్మీ.. తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. హోండురస్‌లోని జైళ్ల సామర్థ్యం కేవలం 8వేలే అయినా ప్రస్తుతం అక్కడ 21వేల మందికి పైగా బందీలుగా ఉన్నారు.
ఇదీ చూడండి: బ్రెజిల్‌ను ముంచెత్తుతున్న వరదలు