అమెరికాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ వరదల్లో చిక్కుకుని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు రెండు మృతదేహాలను అధికారులు గుర్తించారు. వరదల ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు నీట మునగగా, కొన్ని కూలిపోయాయి. 30 మందికి పైగా వరదల్లో గల్లంతయ్యారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగటం వల్ల సహాయక చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు తెలిపారు.
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 34.5 సెంటీమీటర్ల వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. 1982 నుంచి ఈ స్థాయిలో వర్షం నమోదుకావటం ఇదే మొదటిసారన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో టెన్నెస్సీ గవర్నర్ ట్వీట్ చేశారు. అటు న్యూజెర్సీలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అటు న్యూజెర్సీలోనూ భారీ వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. రోడ్లపై భారీగా నీరు చేరటం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
ప్రయాణాలు రద్దు చేసుకోండి..