అమెరికా పదానికి అసలైన అర్థం తన మంత్రివర్గంలో ప్రతిబింబిస్తోందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు తాము ఏవైతే హామీలు ఇచ్చామో వాటిని అమలు చేయబోతున్నామని తెలిపారు. కేబినెట్ తొలి సమావేశాన్ని బైడెన్గురువారం నిర్వహించారు. అమెరికా మౌలిక రంగం కోసం ప్యాకేజీని ప్రకటించిన మరుసటి రోజే ఈ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.
మౌలిక రంగం కోసం ప్రకటించిన ప్యాకేజీ బాధ్యతలను తన కేబినెట్లోని ఐదుగురు మంత్రులకు అప్పగిస్తూ బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. వీరు చేసే ఖర్చులను కేబినెట్ మొత్తం పర్యవేక్షించాలని ఆదేశించారు. కొవిడ్ నిబంధనల మధ్య ఈ భేటీ జరిగింది.