బోయింగ్ సంస్థ తొలి వ్యోమగామి కమాండర్ క్రిస్ ఫెర్గూసన్.. అంతరిక్షంలోకి వెళ్లేందుకు నిరాకరించారు. వచ్చే ఏడాది తన కూతురి వివాహం దగ్గరుండి జరిపించేందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు ఫెర్గూసన్.
గతేడాది డిసెంబర్లో సాంకేతిక లోపాలు తలెత్తినందున బోయింగ్ వ్యోమనౌక అంతరిక్షంలోకి వెళ్లకుండా నిలిచిపోయింది. అదే సమయంలో ఆ సంస్థకు ఎంపికైన ఇద్దరు వ్యోమగాముల్లో.. ఆరోగ్య సమస్యలతో నాసా వ్యోమగామి ఎరిక్బోయ్ వైదొలిగారు. కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ఫెర్గూసన్ కూడా ఇప్పుడు తప్పుకుంటున్నట్టు ప్రకటించారు.
"ఇది చాలా కఠిన నిర్ణయం. నా కుటుంబానికి వచ్చే ఏడాది అత్యంత కీలకం. అందుకోసమే నేను వైదొలగాల్సి వస్తోంది. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. కానీ.. వచ్చే ఏడాది అంతరిక్షంలోకి వెళ్లడం మానేశానంతే."