తెలంగాణ

telangana

ETV Bharat / international

వ్యాక్సిన్ వలంటీర్​ అస్వస్థతపై ఆక్స్​ఫర్డ్ వివరణ

కరోనా టీకా క్లినికల్ ట్రయల్స్​లో వలంటీర్​ అనారోగ్యంపై ఆక్స్​ఫర్డ్ విశ్వవిద్యాలయం స్పందించింది. కరోనా టీకా ప్రయోగం వల్ల వలంటీర్​కు​ అనారోగ్య సమస్యలు రాలేదని భావిస్తున్నట్లు తెలిపింది.

trails oxford
ఆక్స్​ఫర్డ్

By

Published : Sep 17, 2020, 5:11 AM IST

వ్యాక్సిన్​ ట్రయల్స్​లో వలంటీర్​ అస్వస్థతపై ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం వివరణ ఇచ్చింది. ఆ వ్యక్తికి వచ్చిన అనారోగ్య సమస్యలు ఆస్ట్రాజెనికా ప్రయోగించిన కరోనా టీకా వల్ల అయ్యుండకపోవచ్చని తెలిపింది.

ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయం, ఆస్ట్రాజెనికా రూపొందించిన కొవిడ్​-19 వ్యాక్సిన్​ సమర్థమైనదిగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే, బ్రిటన్​లో టీకా ప్రయోగించిన ఓ వ్యక్తి అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ట్రయల్స్​ నిలిపేశారు. ఇలాంటి ప్రక్రియ సహజమేనని.. వ్యాక్సిన్ తయారీ ఆలస్యం కాకుండా కారణం తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపింది.

అయితే నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించిన తర్వాత యూకేలో ట్రయల్స్ పునఃప్రారంభించినట్లు​ సెప్టెంబర్ 12న ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. టీకా ప్రయోగాలు సురక్షితంగానే జరుగుతున్నట్లు నియంత్రణ సంస్థ నిర్ధరించిందని పేర్కొంది.

ఇదీ చూడండి:ఆక్స్​ఫర్డ్ టీకా ట్రయల్స్ పునఃప్రారంభానికి లైన్ క్లియర్

ABOUT THE AUTHOR

...view details