ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తోంది. అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ వైరస్ ప్రభావం అధికంగా ఉంది. అయితే.. ఆయా దేశాల్లో కరోనా ప్రభావం తగ్గి ఆంక్షలను సడలించే సమయానికి భారత్, జపాన్‌లో విజృంభిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జపాన్‌లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని.. భారత్‌లోని అధిక జనాభా కలిగిన ప్రాంతాలు వైరస్ హాట్స్పాట్లుగా మారతాయని హెచ్చరించారు.
పెరుగుతున్న కేసులు..
జపాన్‌లో గురువారం ఒక్కరోజే 500కుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ప్రపంచంలోనే వృద్ధుల జనాభా అధికంగా ఉన్న ఈ దేశంలో వైరస్ వేగంగా విస్తరించటం ఆందోళన కలిగించే విషయం. ప్రధాని షింజో అబే గత వారం టోక్యో సహా 6 ప్రధాన నగరాల్లో లాక్డౌన్ కాకుండా.. ఆరోగ్య అత్యవసర పరిస్థితి విధించారు. అయితే.. ఇప్పటికీ వ్యాపార సంస్థలు, కంపెనీలు ఇంటి నుంచి పనిని నిర్వహించడానికి మొగ్గు చూపటం లేదు. చాలా మంది ప్రయాణికులు యథావిధిగా టోక్యో వీధుల్లో కనిపిస్తున్నారు. ఇదే కొనసాగితే.. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవటం చాలా కష్టంగా మారనుంది.
భారత్‌లోనూ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 5వేలు దాటింది. 150 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే... కరోనా కట్టడి కోసం ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. 130 కోట్ల జనాభా వచ్చే వారం వరకు లాక్డౌన్లో ఉండనున్నారు. ఇళ్లల్లో ఉన్న వారికి ఆహార పదార్థాలు, ఔషధాలు అందిస్తున్నారు.
మెరుగైన సంకేతాలు..