అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అవకతవతకలు జరుగుతున్నాయంటూ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ఆరోపణలు చేస్తున్న తరుణంలో.. పెన్సిల్వేనియాలోని ఫిలడెల్ఫియలో ఓ వార్త కలకలం సృష్టించింది. భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులు.. 'ఫేక్ బ్యాలెట్' ఉన్న ఓ ట్రక్‌ను ఓట్ల లెక్కింపు కేంద్రానికి తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడ్డారు.
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. అనుమతులు లేకుండా ఆయుధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలతో ఇద్దరిని గురువారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. తుపాకులు, ఏఆర్-రైఫిల్‌తో పాటు 160 రౌండ్ల బులెట్లను ట్రక్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి-అమెరికాలో రణం: ఓట్ల లెక్కింపుపై కొనసాగుతున్న నిరసనలు
అయితే ఆ ఫేక్ బ్యాలెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? ట్రక్‌లో వాటిని కనుగొన్నారా? అసలు ఆ ఇద్దరు ఏం చేద్దామనుకున్నారు? వంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం దొరకలేదు. ఎఫ్బీఐతో పాటు ఫిలడెల్ఫియా పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.