ఆపిల్ సీఈవో టిమ్‌కుక్ ట్విట్టర్ ప్రొఫైల్ నేమ్‌ను కొంచెం మార్చారు. ఇంటి పేరు స్థానంలో ఆపిల్ సంస్థ లోగో ఎమోజీని ఉంచారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆపిల్ సీఈవో 'టిమ్ కుక్'ను పొరపాటున 'టిమ్ ఆపిల్'గా సంబోధించారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీంతో టిమ్ తన ట్విట్టర్ ఖాతా పేరును కొద్దిగా మార్చారు.
బుధవారం శ్వేతసౌధంలో 'అమెరికా శ్రామిక విధాన సలహా సంఘం'తో ట్రంప్ సమావేశమయ్యారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. ఆపిల్ సీఈవో టిమ్ కుక్ అమెరికాలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారని కొనియాడారు. ఈ సందర్భంలోనే 'టిమ్‌కుక్'ను 'టిమ్ ఆపిల్' అని ఉచ్చరించారు.
ఇదేమీ మొదటిసారి కాదులే