తెలంగాణ

telangana

ETV Bharat / international

వీసాల బ్యాన్​కు వ్యతిరేకంగా టెక్ దిగ్గజాల వ్యాజ్యం - వీసాల నిషేధానికి వ్యతిరేకంగా టెక్​ సంస్థల పోరు

హె-1బీ వీసా, ఇతర పని వీసాల తాత్కాలిక నిషేధానికి వ్యతిరేకంగా టెక్​ దిగ్గజాలు యాపిల్​, మైక్రోసాఫ్ట్​, గూగుల్​ సహా ఇతర సంస్థలు ఏకతాటిపైకి వచ్చాయి. ట్రంప్​ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి.

Tech companies lawsuit against us govt
వీసాల నిషేధంపై టెక్​ దిగ్గజాల పోరు

By

Published : Aug 12, 2020, 1:18 PM IST

విదేశీ ఉద్యోగులకు తాత్కాలికంగా వీసాలు నిలిపివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి టెక్ కంపెనీల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది. టెక్ దిగ్గజాలు యాపిల్​, ఫేస్​బుక్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్​ ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఓ వ్యాజ్యాన్ని దాఖలు చేశాయి.

కొవిడ్​-19 సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అమెరికా ఆర్థిక వ్యవస్థకు.. ఈ వీసాల నిషేధం నిబంధనలు మరిన్ని చిక్కులు తెచ్చిపెడతాయని వ్యాజ్యంలో పేర్కొన్నాయి ఆయా కంపెనీలు.

దాదాపు 50 టెక్ కంపెనీలు ఈ వ్యాజ్యానికి మద్దతు ప్రకటించాయి.

విసాల నిషేధం ప్రకటన..

హెచ్​-1బీ వీసా సహా తాత్కాలిక పని వీసాలను ఈ ఏడాది చివరి వరకు నిలిపేస్తూ ట్రంప్ ప్రభుత్వం జూన్​లో నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటికే ఈ వీసాలపై అక్కడ పని చేస్తున్న వారిపై మాత్రం ఎలాంటి ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. కరోనాతో నెలకొన్న పరిస్థితుల్లో.. అమెరికా ఉద్యోగుల రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ యంత్రాంగం పేర్కొంది.

ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని.. యాపిల్ సీఈఓ టిమ్​కుక్​, గూగుల్ సీఈఓ సుందర్​ పిచాయ్ సహా టెక్​ దిగ్గజాల అధినేతలు బహిరంగంగానే తప్పుబట్టారు.

ఆర్థిక వ్యవస్థ వృద్ధి, టెక్​ ప్రపంచంలో అగ్రస్థానంలో అమెరికా ఉందంటే.. అందుకు వలసదారుల కృషి ఎంతో ఉందని సుందర్ పిచాయ్ గుర్తు చేశారు. అందుకే ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా, పని కోసం వలస వచ్చే వారికి మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి:రిలయన్స్‌ ఓ2సీలో వాటా కొనుగోలు యోచనలో ఆరామ్​కో

ABOUT THE AUTHOR

...view details