తెలంగాణ

telangana

ETV Bharat / international

పోటీ చేయను : హిల్లరీ

అమెరికా ప్రస్తుత ప్రభుత్వం ఎన్నో హామీలను విస్మరించిందని ఆరోపించారు హిల్లరీ క్లింటన్​. వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయకున్నా సమస్యలపై గళం వినిపిస్తానని ఆమె స్పష్టం చేశారు.

హిల్లరీ క్లింటన్​

By

Published : Mar 5, 2019, 12:50 PM IST

Updated : Mar 5, 2019, 3:33 PM IST

2020లో జరిగే అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయబోనని చెప్పారు మాజీ ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్​.

" నేను పారిపోవడం లేదు. నమ్మిన సిద్ధాంతాల కోసం నేను పని చేస్తూనే ఉంటా. మాట్లాడుతూనే ఉంటా" అని స్పష్టం చేశారు. అమెరికాలోని ఓ టీవీ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

వచ్చే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయనన్న హిల్లరీ క్లింటన్​

2016 ఎన్నికల్లో డొనాల్డ్​ ట్రంప్​ చేతిలో ఓడిపోయారు హిల్లరీ​. ఆ ఎన్నికల్లో ఆమె గెలుస్తారని చాలా మంది అంచనా వేశారు. కానీ అవన్నీ తలకిందులయ్యాయి.

"నేనెక్కడికీ వెళ్లను. అమెరికాలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు నన్ను చాలా ఆవేదనకు గురి చేస్తున్నాయి. నేను సమస్యలపై గొంతుక వినిపిస్తానని నా అమెరికా ప్రజలకు హమీ ఇస్తున్నా. " -హిల్లరీ క్లింటన్​

అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్న కొందరు డెమొక్రాట్లతో హిల్లరీ ఇటీవలే భేటీ అయ్యారు. పోటీ చేయాలనుకుంటున్న వారిలో అమెరికా మాజీ ఉపాధ్యక్షుడు జో బిడెన్​ కూడా ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

" ప్రస్తుత ప్రభుత్వం చాలా హామీలను విస్మరించింది. అమెరికా ఎదుర్కొంటున్న సమస్యల చిట్టా చాలా పెద్దగా ఉంది. వాటిని వెలుగులోకి తీసుకొచ్చి.. ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది."-- హిల్లరీ క్లింటన్​

ఏదైనా పదవిలో ఉండాలని అనుకుంటున్నారా అనే ప్రశ్నకు.. అలాంటిదేమీ లేదని సమాధానమిచ్చారు హిల్లరీ.

" నేను ఏ పదవిలో ఉండాలనుకోవడం లేదు. నాకు న్యూయార్క్​ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి గతంలో సెనేటర్​గా ఎనిమిదేళ్ల పాటు ప్రజలకు సేవలందించటం, వారితో కలిసి పనిచేయటం అదృష్టంగా భావిస్తున్నా." -- హిల్లరీ క్లింటన్​

Last Updated : Mar 5, 2019, 3:33 PM IST

ABOUT THE AUTHOR

...view details