తెలంగాణ

telangana

ETV Bharat / international

కశ్మీర్​ అంశంపై పాక్​తో ప్రత్యక్షంగానే: జయ్​శంకర్ - కశ్మీర్

కశ్మీర్​ విషయమై పాకిస్థాన్​తో నెలకొన్న వివాదాన్ని ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ స్పష్టం చేశారు. మధ్యవర్తిత్వం వహిస్తామన్న అమెరికా ప్రకటనను థాయ్​లాండ్​లో జరిగిన 9వ తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సమావేశంలో సున్నితంగా తిరస్కరించారు.

కశ్మీర్​ అంశం పాక్​తో ప్రత్యక్షంగానే: జయ్​శంకర్

By

Published : Aug 2, 2019, 1:38 PM IST

దాయాది పాకిస్థాన్​తో కశ్మీర్ అంశంపై ప్రత్యక్ష ద్వైపాక్షిక సంబంధాల ద్వారానే చర్చిస్తామని భారత విదేశాంగ మంత్రి జయ్​శంకర్ తెలిపారు. థాయ్​లాండ్​లో 9వ తూర్పు ఆసియా విదేశాంగ మంత్రుల శిఖరాగ్ర సమావేశం జరిగింది. ఇందులో భాగంగా అమెరికా విదేశీ వ్యవహారాల మంత్రి మైక్ పాంపియోతో భేటీ అయ్యారు జయ్​శంకర్​. కశ్మీర్ అంశంలో అగ్రరాజ్య జోక్యాన్ని సున్నితంగా తిరస్కరించారు.

"కశ్మీర్​ అంశంలో ఏదైనా చర్చించాల్సి వస్తే పాకిస్థాన్​తో ద్వైపాక్షికంగానే ముందుకు వెళతాం."

- జయ్​శంకర్​, విదేశీ వ్యవహారాల మంత్రి

అమెరికా విదేశాంగ మంత్రి పాంపియోతో పలు సమస్యలపై చర్చించినట్లు జయ్​శంకర్​ ట్వీట్​ చేశారు.

కశ్మీర్ అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ వ్యాఖ్యానించిన తర్వాత ఇరువురు విదేశాంగ మంత్రులు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్రంప్​ ఏమన్నారు..?

కశ్మీర్ అంశమై మధ్యవర్తిత్వం వహించాలనిభారత ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు ట్రంప్ ఉద్ఘాటించారు. జపాన్ ఒసాకాలో జరిగిన జీ-20 శిఖరాగ్ర సమావేశం వేదికగా మోదీ ఈ మేరకు కోరారని తెలిపారు.

ఈ వ్యాఖ్యలను భారత్ ఖండించగా.. దాయాది పాకిస్థాన్ స్వాగతించింది.

ఇదీ చూడండి: 'ఎన్​ఎంసీ' బిల్లుపై నిరసనల సెగ- నిలిచిన సేవలు

ABOUT THE AUTHOR

...view details