తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐరాస సెక్రటరీ జనరల్​గా మళ్లీ ఆయనే.. - UNO

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా ఆంటోనియో గుటెరస్‌ మరోసారి ఎంపికయ్యారు. 193 సభ్య దేశాలు గల ఐరాస సాధారణ అసెంబ్లీ ఆంటోనియో వైపే మెుగ్గు చూపింది.

un
ఐక్యరాజ్య సమితి

By

Published : Jun 18, 2021, 8:06 PM IST

Updated : Jun 18, 2021, 10:28 PM IST

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా మరోమారు ఆంటోనియో గుటెరస్‌ ఎంపికయ్యారు. 2022 జనవరి నుంచి మరో ఐదేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. 193 సభ్య దేశాలు గల ఐరాస సాధారణ అసెంబ్లీ గుటెరస్​ వైపే మెుగ్గు చూపడం వల్ల ఆయన మరింత కాలం పదవిలో కొనసాగేందుకు మార్గం సుగమమైంది.

కరోనా కోరల నుంచి ప్రపంచాన్ని రక్షించడం కోసం శాయశక్తులా కృషి చేస్తానని గుటెరస్​ అన్నారు. రెండోసారి పదవి చేపట్టిన ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రపంచం కరోనా వల్ల తీవ్రంగా నష్టపోయింది. అయితే సంక్షోభ పరిస్థితుల్లో పరస్పర సహకారంతో ప్రపంచ దేశాలన్ని కలసికట్టుగా ఉండాలనే గొప్ప పాఠాన్ని కరోనా మనకు నేర్పింది. ప్రస్తుతం మన ఆలోచనలలో, విధానాలలో మార్పు వస్తోంది. పాత సంప్రదాయాలు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు మనం అవకాశాలు కల్పించుకుని మన రాతను మనమే మార్చుకోవాలి. ఆ సత్తా మనకుంది.

-ఆంటోనియో గుటెరస్‌, ఐరాస సెక్రటరీ జనరల్‌

2017లో గుటెరస్‌ తొలిసారి ఐరాస సెక్రటరీ జనరల్‌గా ఎంపికయ్యారు. ఆయన పదవి కాలం 2021 డిసెంబర్‌తో ముగియనుండడం వల్ల మరోమారు గుటెరస్‌ను కొనసాగించాలని ఐరాస నిర్ణయించింది.

ఇదీ చదవండి:ఐరాస ఆర్థిక, సామాజిక మండలిలో భారత్

Last Updated : Jun 18, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details