ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీ గురించి రోజుకో విషయం బయటకి వస్తోంది. గత ఆదివారం ఆంటిగ్వాలో కనిపించకుండా పోయిన మెహుల్ ఛోక్సీ.. రెండు రోజుల తర్వాత పక్కనే ఉన్న డొమినికా దీవిలో పోలీసులకు చిక్కారు. అయితే ఛోక్సీ తన గర్ల్‌ఫ్రెండ్‌తో విహారయాత్రకు వెళ్లి ఉండొచ్చని ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్ వ్యాఖ్యానించారు.
"మెహుల్ ఛోక్సీ తన గర్ల్‌ఫ్రెండ్‌తో సరాదాగా రొమాంటిక్ ట్రిప్‌కి వెళ్లి పోలీసులకి చిక్కి ఉండొచ్చు."
--గాస్టన్ బ్రౌన్, ఆంటిగ్వా ప్రధాని.