డొమినికాలో పట్టుబడ్డ మెహుల్ చోక్సీని నేరుగా భారత్కు తిరిగి అప్పగించడానికే ఆంటిగ్వా ప్రాధాన్యం ఇస్తున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై ప్రభుత్వం స్పష్టతకు వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రధాని గాస్టన్ బ్రౌనీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆంటిగ్వా నుంచి చోక్సీ డొమినికాకు పరారుకావడంపై చర్చించారని పేర్కొంది.
చోక్సీ పౌరసత్వం రద్దు, భారత్కు అప్పగింతపై పెండింగ్లో ఉన్న కేసుల విచారణను వేగవంతం చేస్తామని ఆంటిగ్వా సమాచార శాఖ మంత్రి మెల్ఫర్డ్ నికోలెస్ తెలిపారు. అయితే చోక్సీ పరారీలో ఓ మహిళ హస్తం ఉందన్న ఆరోపణలపై వివరాలు వెల్లడించడానికి మంత్రి నిరాకరించారు.
'చోక్సీని తప్పకుండా తీసుకువస్తాం'
మెహుల్ చోక్సీని డొమినికా నుంచి భారత్కు తిరిగి రప్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది.