తెలంగాణ

telangana

ETV Bharat / international

కరోనాను 100 శాతం నిరోధిస్తున్న యాంటీబాడీ! - కరోనాను నియంత్రించే యాంటీబాడీ

కొవిడ్​-19కు కారణమైన సార్స్​-కోవి-2 మానవశరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలకు సంక్రమించకుండా ఎస్​టీఐ-1499 అనే యాంటీబాడీ సమర్థవంతంగా పనిచేస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ద్వారా కరోనా మహమ్మారిని జయించేందుకు ఓ కాక్టెయిల్ యాంటీబాడీని రూపొందించేందుకు కృషి చేస్తున్నారు.

Antibody found to block COVID-19 virus 100% in experiments
కరోనాను 100 శాతం నిరోధిస్తున్న ఎస్​టీఐ-1499 యాంటీబాడీ

By

Published : May 17, 2020, 3:20 PM IST

కరోనా వ్యాధిని నయం చేసే వ్యాక్సిన్​ కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. తాజాగా 'ఎస్​టీఐ-1499' అనే యాంటీబాడీ ... కొవిడ్-19కు కారణమైన సార్స్​ కోవి-2ను ఆరోగ్యవంతమైన కణాలకు వ్యాప్తి చెందనివ్వకుండా పూర్తిగా నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తోందని వెల్లడైంది.

కాలిఫోర్నియాలోని శాన్​డియాగోకు చెందిన 'సొరెంటో థెరప్యూటిక్స్' అనే బయోఫార్మాస్యూటికల్ సంస్థ తాజా పరిశోధన ఫలితాలను ప్రకటించింది.

"ప్రాథమిక జీవరసాయన, జీవభౌతిక విశ్లేషణలు ఎస్​టీఐ-1499ని ఒక శక్తివంతమైన యాంటీబాడీ డ్రగ్​గా సూచిస్తున్నాయి. ప్రీ క్లీనికల్ లాబొరేటరీ ప్రయోగాల్లోనూ... చాలా తక్కువ మోతాదులోని ఎస్​టీఐ-1499 యాంటీబాడీ... సార్స్ కోవి-2ను నిరోధించగలిగింది." -సొరెంటో థెరప్యూటిక్స్

కాక్టెయిల్ రక్షణ కవచం..

సొరెంటో థెరప్యూటిక్స్... సార్స్​-కోవి-2 సంక్రమణను అడ్డుకునే రక్షణ కవచంలా ఒక కాక్టెయిల్ యాంటీబాడీని తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంస్థ ఇప్పటికే బిలియన్ల కొద్ది యాంటీబాడీలను పరీక్షించింది. వీటి నుంచి సార్స్-కోవి-2 స్పైక్ ప్రొటీన్​కు చెందిన ఎస్​-1 సబ్​యూనిట్​ను బంధించే వందలాది యాంటీబాడీలను గుర్తించింది.

వీటిలోని ఓ డజను యాంటీబాడీలు... 'ఎస్​-1 ప్రోటీన్'​ మానవశరీరంలోని (యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్​2) ఏసీఈ-2 ఎంజైమ్​తో కలవడాన్ని సమర్థవంతంగా నిరోధించగలుగుతున్నాయని పరిశోధనల్లో తేలింది.

ఈ యాంటీబాడీలను ఇన్విట్రో సార్స్-కోవి-2 సోకిన కొంత మంది వ్యక్తులపై పరీక్షించారు. వీటిలో ఎస్​టీఐ-1499 అనే యాంటీబాడీ... మానవశరీరంలోని ఆరోగ్యవంతమైన కణాలల్లో సార్స్-కొవి-2 సంక్రమణ చెందకుండా పూర్తిగా నిరోధించే సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

స్టాండ్ అలోన్ థెరపీ..

ఎస్​టీఐ-1499ను స్టాండ్ అలోన్ థెరపీగా అభివృద్ధి చేయవచ్చని సొరెంటో థెరప్యూటిక్స్ భావిస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తే, దీని ఉత్పత్తిని పెంచి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. ఈ యాంటీబాడీ అనేకమంది ప్రాణాలను రక్షించగలుగుతుందని సంస్థ విశ్వాసం వ్యక్తం చేసింది.

ఇదీ చూడండి:వీధుల్లో ఆ మందు స్ప్రే చేయడం ప్రమాదకరం!

ABOUT THE AUTHOR

...view details