కొవిడ్-19 వ్యాక్సిన్ అభివృద్ధిలో మరో పురోగతి. ఔషధ దిగ్గజం ఫైజర్-జర్మనీ బయోటెక్ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్... ఆరోగ్యవంతులైన 18-55 ఏళ్ల వయస్కుల రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా బలోపేతం చేస్తున్నట్టు తేలింది. తొలిదశ క్లినికల్ ప్రయోగాల్లో ఈ ఫలితాలు వచ్చినట్టు జర్నల్ నేచర్ పత్రిక పేర్కొంది.
సింగిల్ డోసుతో 21 రోజుల్లోనే యాంటీబాడీలు - america corona vaccine news
ఔషధ దిగ్గజం ఫైజర్-జర్మనీ బయోటెక్ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్... ఆరోగ్యవంతులైన 18-55 ఏళ్ల వయస్కుల రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా బలోపేతం చేస్తున్నట్టు తేలింది. సింగిల్ డోసుతోనే 21 రోజుల్లోనే యాంటీబాడీలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.
పరిశోధకులు రోగనిరోధక శక్తిని ప్రతిస్పందింపజేసే 'బీఎన్‌టీ162బీ1' అనే ఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారుచేశారు. దీనిలోని కీలక పదార్థం... కరోనా రిసిప్టర్-డొమైన్‌లో భాగమయ్యే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసేలా జీవకణాలను అనుమతిస్తుంది. మరోవైపు, దీని ఆధారంగా యాంటీబాడీలను విడుదల చేసేలా రోగనిరోధక వ్యవస్థనూ ప్రేరేపిస్తుంది. ప్రయోగ పరీక్షల్లో భాగంగా 18-55 ఏళ్ల వయసున్న 45 మంది ఆరోగ్యవంతులకు దీన్ని ఇచ్చారు. సింగిల్ డోసుతోనే వారిలో 21 రోజుల్లోనే యాంటీబాడీలు కనిపించాయని పరిశోధకులు వివరించారు.