కరోనా వ్యాక్సిన్ డోసులకు మధ్య విరామాన్ని పెంచడం వల్ల హానికరమైన కరోనా కొత్త వేరియంట్ల ముప్పు పొంచి ఉంటుందని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోని ఫౌచీ హెచ్చరించారు. గత నెలలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసుకు రెండో డోసుకు 6 నుంచి 8 వారాలుగా ఉన్న గడువును కేంద్రం 12 నుంచి 16 వారాలకు పెంచింది. ఇలా వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం పెంచడం వల్ల ప్రజలు కరోనా కొత్త వేరియంట్ల బారిన పడే అవకాశం ఉందని ఫౌచీ తెలిపారు.
బ్రిటన్‌లో కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య వ్యవధిని పెంచడం వల్ల ప్రజలు కొత్త వేరియంట్ల బారినపడ్డారని గుర్తుచేశారు ఫౌచీ. కాబట్టి షెడ్యూల్ ప్రకారమే టీకాలను పంపిణీ చేయాలని సూచించారు. డెల్టా వంటి ప్రమాదకరమైన స్ట్రెయిన్లను అరికట్టేందుకు ఇదే మార్గమని అభిప్రాయపడ్డారు.