Anthony Fauci on omicron: ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు, ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని ముందస్తు అధ్యయనాలు చాటుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్ ప్రభావంపై ఓ నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో శాస్త్రవేత్తలకు మరింత సమాచారం కావాల్సి ఉందని చెప్పారు.
"ఇప్పటివరకైతే.. ఒమిక్రాన్ ద్వారా వ్యాధి తీవ్రత అధికంగా ఉంటుందన్న ఆధారాలు అయితే లేవు. అయితే.. డెల్టా కంటే ఈ వేరియంట్ తక్కువగా వ్యాధి తీవ్రతను కలిగిస్తుందని, తీవ్రమైన అనారోగ్యానికి కారణం కాదనే విషయాలపై స్థిరాభిప్రాయనాకి వచ్చే ముందు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది."
-ఆంటోని ఫౌచీ, అమెరికా అంటువ్యాధుల నిపుణుడు
ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఆఫ్రికా దేశాలపై విధించిన ప్రయాణ ఆంక్షలను ఎత్తివేసేందుకు బైడెన్ ప్రభుత్వం త్వరలోనే చర్యలు తీసుకోనుందని ఆంటోని ఫౌచీ తెలిపారు. "అతి త్వరలోనే ప్రయాణ ఆంక్షలను ఎత్తివేయాలని బైడెన్ ప్రభుత్వం యోచిస్తోంది. ఒమిక్రాన్ వెలుగు చూసిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా సహా ఇతర ఆఫ్రికా దేశాలు ఎదుర్కొన్న ఇబ్బందులు మనందరికీ తెలుసు" అని ఆయన వ్యాఖ్యానించారు.
Omicron cases in America: ఒమిక్రాన్ కేసులు అమెరికాలో మరింతగా విస్తరిస్తున్నాయి. శనివారం న్యూయార్క్‌లో తొలికేసు నమోదు కాగా.. ఆదివారం మరో రెండు కేసులువెలుగులోకి వచ్చాయి. దీంతో ఆ ఒక్క రాష్ట్రంలోనే ఇప్పటి వరకు ఎనిమిది కేసులు నమోదయ్యాయి. దీంతో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైనట్లు నిపుణులు అనుమానిస్తున్నారు.
ఇదీ చూడండి:'ఆందోళన వద్దు.. కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రి చేరికలు తక్కువే'
డెల్టా, బీటా కంటే అధికంగానే..