తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతరిక్ష మార్గం సుగమం! - nasa

వ్యోమగాములను అంతరిక్షానికి తీసుకెళ్లే స్పేస్​ ఎక్స్​ రాకెట్​ను నాసా ప్రయోగించనుంది. ఈ ప్రయోగం విజయం సాధిస్తే ఈ ఏడాదే ఇద్దరు వ్యోమగాములను రోదసిలోకి పంపుతామని తెలిపింది.

స్పేస్​ ఎక్స్​ రాకెట్

By

Published : Mar 2, 2019, 11:07 AM IST

స్పేస్​ ఎక్స్​ రాకెట్

అంతరిక్షానికి మనుషులు ప్రయాణించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెబుతోంది నాసా. ఇందుకోసం స్పేస్​ఎక్స్​ తయారు చేసిన రాకెట్​ను మరికొన్ని గంటల్లో ప్రయోగించనుంది. ఫ్లోరిడా కేప్​ కెనవెరల్​ లోని కెన్నెడీ స్పేస్​ సెంటర్​ నుంచి శనివారం మధ్యాహ్నం 1:19 గంటలకు ఈ రాకెట్​ను అంతరిక్షంలోని పంపనున్నారు.​ 'రిప్లే' పేరుగల బొమ్మను ఈ రాకెట్​లో ఉంచి వ్యోమగాముల ప్రయాణానికి ఇది సురక్షితమో, కాదో తెలుసుకోనున్నారు.

ఆదివారానికి ఇది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుతుంది. మార్చి 8కి తిరిగి భూమిని చేరుతుంది.

ఈ ఏడాదే అంతరిక్షానికి

అనుకున్న విధంగా స్పేస్​ ఎక్స్​ రాకెట్​ ప్రయోగం విజయవంతమైతే ఈ ఏడాది చివరినాటికి ఇద్దరు వ్యోమగాములను పంపే యోచనలో ఉంది నాసా.

ఎనివిదేళ్ల తర్వాత మరోసారి...

దాదాపు ఎనిమిదేళ్ల క్రితం... 2011 జులై 11న స్పేస్​ ఎక్స్​ డ్రాగన్​ రాకెట్​ ప్రయోగం జరిగింది. ఆ తర్వాత మళ్లీ వ్యోమగాములను అంతరిక్షానికి తీసుకెళ్లే రాకెట్​ను ఇప్పడే ప్రయోగించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details