తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎన్నికల్లో ట్రంప్​ విజయం కోసం చైనా ప్రార్థనలు!

ఈ ఏడాది నవంబర్​లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ గెలవాలని చైనా బలంగా కోరుకుంటున్నట్టు ఓ నివేదిక తెలిపింది. ట్రంప్​ మరోమారు అధ్యక్ష బాధ్యతలు చేపడితే.. తమకే ఉపయోగం అని చైనా భావిస్తున్నట్టు తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, తమ దేశంపై కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ ట్రంప్​ విజయం సాధించాలని చైనా ఎందుకు అనుకుంటోంది?

Another Trump term may enable China to expand its influence in Asia-Pacific: Report
ట్రంప్​ మళ్లీ అధ్యక్షుడైతేనే చైనాకు లాభమా?

By

Published : Jul 12, 2020, 2:41 PM IST

చైనీస్​ వైరస్... వుహాన్​ వైరస్... కుంగ్​ ఫ్లూ... కరోనా గురించి మాట్లాడిన సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన ప్రభుత్వం ప్రయోగించిన పదాలివి. ఈ మాటల వెనుక ఉద్దేశం ఒకటే... చైనాను దోషిగా చూపడం. కరోనా సంక్షోభానికి ఆ దేశమే ప్రధాన కారణమని అంతర్జాతీయ సమాజం దృష్టిలో బలంగా పాతుకుపోయేలా చేయడం.

కరోనా మాత్రమే కాదు... 'వాణిజ్యం' విషయంలోనూ ట్రంప్​ది ఇదే వైఖరి. చైనా అనైతిక వాణిజ్య విధానాలు అవలంబిస్తోందంటూ గతేడాది 'పెద్ద యుద్ధమే' చేశారాయన. అలా ట్రంప్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఏదో ఒక రూపంలో వాషింగ్టన్-బీజింగ్ మధ్య పరస్పరం మాటలు, ఆంక్షల దాడులు నడుస్తూనే ఉన్నాయి.

ఇలాంటి ఉద్రిక్తతల మధ్య.. ఈ ఏడాది నవంబర్​లో అధ్యక్ష ఎన్నికలకు వెళ్లనున్నారు ట్రంప్​. ఈ ఎన్నికల్లో ట్రంప్​ ఓటమిని చైనా కోరుకుంటుందని.. ఇరు దేశాల పరిస్థితులు చూసినవారెవరైనా అనుకుంటారు. అదే చైనాకు కూడా మంచిదని విశ్వసిస్తారు. కానీ వీటికి విరుద్ధంగా.. చైనా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్​ మరోమారు గెలుపొందితే.. తమకే మంచిదని చైనా ప్రభుత్వం భావిస్తున్నట్టు ఓ నివేదిక బయటకు వచ్చింది. ఇది ఎలా సాధ్యం? ట్రంప్​ గెలిస్తే చైనాకు లాభమేంటి?

డెమొక్రాట్లతో కష్టమే...

డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే.. అమెరికా దౌత్య విధానాలను మరింత కఠినంగా అమలు చేసే అవకాశముందని చైనా విశ్వసిస్తోంది. దీని వల్ల తమకు భారీ నష్టం కలుగుతుందని భావిస్తోంది. అందువల్ల.. ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని వివాదాలు చెలరేగినా, ఎన్ని ఆంక్షలు విధించినా.. మరో నాలుగేళ్ల పాటు అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్​ కొనసాగాలని చైనా కోరుకుంటోంది. ఫలితంగా తూర్పు ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా తన పలుకుబడిని పెంచుకోవాలని చూస్తున్నట్టు 'ద అట్లాంటిక్​' మ్యాగజైన్​లో రాసుకొచ్చారు టైమ్స్​ కరస్పాండెంట్​, ప్రముఖ రచయిత మైఖేల్​ షూమన్​.

ఇదీ చూడండి:-టార్గెట్ చైనా: భారీ ప్లాన్​ రెడీ చేస్తున్న ట్రంప్!

తన వాదనకు మరింత బలంచేకూర్చడానికి పలువురు చైనా అధికారుల వ్యాఖ్యలను ప్రస్తావించారు షూమన్​. 'ట్రంప్​ మరోమారు ఎన్నికవ్వాలి. అలా జరిగితే మేము ఎంతో సంతోషిస్తాం' అని చైనా మాజీ వాణిజ్య అధికారి లాంగ్​ యుగ్​టూ అనడాన్ని గుర్తుచేశారు మైఖేల్​.

చైనా కమ్యూనిస్ట్​ పార్టీ పత్రిక గ్లోబల్​ టైమ్స్ ఎడిటర్​ హు షీజిన్​​ ట్రంప్​పై ఇదే విధంగా స్పందించారు.

"మీరు మరోమారు అధ్యక్షుడవ్వాలని కోరుకుంటున్నా. మీరు అమెరికాను అసాధారణ స్థితిలో ఉంచుతారు. చైనా ప్రజల్లో ఐకమత్యం పెరిగేలా మీరు సహాయం చేస్తారు. మిమ్మల్ని ఇక్కడ 'జియాన్​గ్వో' అని అంటారు. చైనా నిర్మాణానికి సహాయం చేసే వ్యక్తి అని దాని అర్థం."

--- హు షీజిన్​, గ్లోబల్​ టైమ్స్​ ఎడిటర్​.

ఆసియాపై ట్రంప్​ వైఖరి...

వీటన్నింటికి మించి.. ట్రంప్ మరోమారు​ అధ్యక్షుడవ్వాలని చైనా కోరుకోవడానికి మరో బలమైన కారణముందని షూమన్​ వివరించారు. అది ఆసియాపై ట్రంప్​ చూపించే 'అశ్రద్ధ' అని పేర్కొన్నారు.

అగ్రరాజ్య మాజీ అధ్యక్షుడు బరాక్​ ఒబామా.. తన హయాంలో ఆసియాకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా తన నిబంధనలు మార్చుకోవాలని అనేక మంది అధ్యక్షులు చైనాపై ఒత్తిడి పెంచారు. కానీ ట్రంప్​ ఇందుకు విరుద్ధం. ఉత్తరకొరియా వ్యవహారం, వాణిజ్య అంశం మినహా ఆసియాను పెద్దగా పట్టించుకోలేదు.

మరోవైపు తన ఆధిపత్యాన్ని పెంపొందించుకోవడానికి కరోనా వైరస్​ సంక్షోభాన్ని కూడా చైనా ఉపయోగించుకోవాలని చూస్తున్నట్టు షూమన్​ తెలిపారు. అమెరికాలో వైరస్​ కట్టడికి ట్రంప్​ చేసిన విఫలయత్నాన్ని ప్రస్తావిస్తూ.. ప్రపంచస్థాయిలో అగ్రరాజ్య నాయకత్వంపై అనేక ప్రశ్నలు సంధిస్తోందని పేర్కొన్నారు. అమెరికాకు తామే ప్రత్యామ్నాయమని ప్రపంచ దేశాలకు చాటిచెప్పేందుకు చైనా ప్రయత్నిస్తున్నట్టు షూమన్​ వెల్లడించారు.

ఇవీ చూడండి:-

బెర్నీ-బైడెన్​ భాయిభాయి.. ట్రంప్ భవిష్యత్తు ఏం కానుంది?

'చైనాతో వాణిజ్య ఒప్పందం ఇప్పట్లో లేనట్టే'

చైనా నిజస్వరూపం బయటపడింది: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details