తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా ఉద్యోగంపై మళ్లీ చిగురించిన ఆశలు - h1b visa updates

అమెరికాలో ఉద్యోగం చేయాలని తపించే వారికి మరో అవకాశం లభించనుంది. అనుకున్న సంఖ్యలో దరఖాస్తులు రాని కారణంగా లాటరీ ద్వారా ఇంకోసారి అభ్యర్థులను ఎంపిక చేయాలని అమెరికా సూత్రప్రాయంగా నిర్ణయించింది. వారంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

another opportunity for h1b visa seekers
అమెరికా ఉద్యోగంపై మళ్లీ చిగురించిన ఆశలు

By

Published : Aug 17, 2020, 7:47 AM IST

అమెరికాలో ఉద్యోగం చేయాలని కలలుకనే వారి ఆశలు చిగురించాయి. ఉద్యోగం కోసం మరో దఫా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించనుంది. 2021కి గాను హెచ్‌1బి ఉద్యోగాలకు చాలినంతమంది ఎంపిక కాకపోవటంతో లాటరీ ద్వారా ఇంకోసారి అభ్యర్థులను ఎంపిక చేయాలని అమెరికా సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఒక ఏడాదిలో ఉద్యోగాలకు రెండుసార్లు లాటరీ ద్వారా ఎంపిక చేయడం ఇదే తొలిసారని నిపుణులు అంటున్నారు. వారంలో ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.

ఏటా 85 వేల మందికి వీసాలు

అమెరికాలో హెచ్‌1బి వీసాపై ఉద్యోగం చేసేందుకు అభ్యర్థులను ఏటా లాటరీ ద్వారా ఎంపిక చేస్తుంది. ప్రతి ఏటా 85 వేల మందికి ఇలా వీసాలను అమెరికా జారీ చేస్తుంది. 2021 కోసం మార్చిలో సుమారు 2.67 లక్షల దరఖాస్తు చేసుకోగా లాటరీ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసింది. ఆయా కంపెనీలు ఉద్యోగార్థుల పక్షాన వీసా కోసం పిటిషన్లను ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా తీవ్రతతో అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య లక్షలు దాటడంతో హెచ్‌1బి వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఆంక్షలు విధించారు. దాంతో కొన్ని కంపెనీలు నియామకాలను పరిమితం చేసుకున్నాయి. అందువల్ల 85 వేల హెచ్‌1బి వీసాలు జారీ చేసేందుకు చాలినన్ని పిటిషన్లు అందలేదు.గతంలో విధించిన ఆంక్షలను సడలిస్తూ ట్రంప్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వీసాలు ఉన్న వారు యథావిథిగా అమెరికా వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. వీసాల కోసం పూర్తి స్థాయిలో దరఖాస్తులు రాకపోవటంతో మరోసారి లాటరీ ద్వారా ఎంపిక చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. ఎంతమందిని ఎంపిక చేస్తారన్న అంశంపై స్పష్టత లేదు.

ఇదీ చూడండి: అమెరికాలో కాల్పుల మోత.. నలుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details