తెలంగాణ

telangana

ETV Bharat / international

ఖైదీల మధ్య ఘర్షణ.. మరో 18 మంది మృతి - తెలుగులో అంతర్జాతీయ వార్తలు

హోండురస్​ జైళ్లలో ఘర్షణల కారణంగా ఖైదీలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెండు రోజుల వ్యవధిలో రెండు జైళ్లలో తీవ్ర హింస చెలరేగింది. రాజధాని తెగుసిగల్పా జైల్లో జరిగిన ఘర్షణలో 18 మంది మరణించారు.

HONDURAS-PRISONERS
HONDURAS-PRISONERS

By

Published : Dec 23, 2019, 9:46 AM IST

మధ్య అమెరికాలోని హోండురస్​ జైలులో ఖైదీల మధ్య జరిగిన తీవ్ర ఘర్షణలో 18 మంది చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. హోండురస్​ రాజధాని తెగుసిగల్పాలోని ఎల్​ పోర్వనిర్​ జైలులో జరిగిన ఈ ఘర్షణలో తుపాకులు, వేట కత్తులు వాడారని పోలీసులు తెలిపారు.

రెండు రోజుల క్రితం హోండురస్​ ఉత్తర టెలా ఓడరేవు పట్టణంలోని జైల్లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇందులో సుమారు 18మంది చనిపోగా 16మంది గాయపడ్డారు.

భద్రత పెంపునకు ఆదేశాలు..

ఈ ఘటనతో అప్రమత్తమయిన హోండురస్​ అధ్యక్షుడు జువాన్​ ఓర్లాండో హెర్నాండెజ్​... జైళ్లలో భద్రత పెంపునకు ఆదేశించారు. దేశంలోని 27 జైళ్లను సైన్యం, పోలీసులు పూర్తి నియంత్రణలోకి తీసుకోవాలని చెప్పారు.

హోండురస్​ జైళ్లలో 21వేల మంది ఖైదీలు ఉన్నారు. ఇందులో 18 జైళ్లు ప్రమాదకరమైనవిగా గుర్తించింది సైన్యం.

ఇదీ చూడండి: హోండురస్‌ జైల్లో 18 మంది ఖైదీలు మృతి

ABOUT THE AUTHOR

...view details