తెలంగాణ

telangana

ETV Bharat / international

2016 స్క్రీన్​ప్లేతో ట్రంప్​-2020 హిట్ అవుతుందా? - 2020 us presidential elections

2016... అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న సమయం. ట్రంప్​ గెలవడం కష్టమేనన్నది దాదాపు అన్ని సర్వేల మాట. అప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నారు ఆయన. ప్రచార బృందంలో మార్పులు చేసి... ప్రజలకు దగ్గరవ్వడంలో సఫలమయ్యారు. అధికారం చేపట్టారు. నాలుగేళ్లు గడిచాయి. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. ఈసారీ ప్రతికూల పవనాలే. అందుకే 2016నాటి ఎత్తుగడనే మళ్లీ వేశారు ట్రంప్. ప్రచార బృందంలో మార్పాలు చేశారు. మరి ఈసారి ఆ వ్యూహం ఫలిస్తుందా? 2016కి, 2020కి తేడా లేదా?

Analysis: Trump wants a 2016 repeat in a very different year
'ప్రచారానికి బదులు తనను తాను మార్చుకుంటే మంచిది'

By

Published : Jul 18, 2020, 6:59 PM IST

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. ఓవైపు అగ్రరాజ్య తొలి అధ్యక్షురాలిగా ఎన్నికవ్వాలని హిల్లరీ క్లింటన్​ ప్రయత్నిస్తుంటే... ఎలాంటి రాజకీయ అనుభవం లేని ఓ వ్యాపారవేత్త ఆమె ప్రయత్నాలపై నీళ్లు చల్లారు. సాధారణంగా వ్యాపారవేత్తల్లో ఉండే చాతుర్యంతో శ్వేతసౌధాన్ని విజయవంతంగా నడిపిస్తారన్న ఆశతో అమెరికన్ ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. డొనాల్డ్​ ట్రంప్​ను అధికారం పీఠం ఎక్కించారు.

అమెరికాను ట్రంప్ ఎలా నడిపించారనేది పక్కనబెడితే.. అప్పటి నుంచి ఇప్పటివరకు ట్రంప్ వ్యవహార తీరులో పెద్దగా మార్పు లేదనే చెప్పుకోవాలి. తన పాదరస స్వభావాన్ని కొనసాగిస్తూనే ఎన్నికల్లో తన వ్యూహాలు అమలు చేశారు. ఎన్నికలకు కొద్దిరోజుల ముందు ప్రచార బృందంలో కీలక సభ్యులను మార్చడం వంటివి చేపట్టారు.

ఇదీ చదవండి:అమెరికా ఎన్నికల ప్రచారం 'చైనా'మయం!

ఇప్పుడు నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ట్రంప్ మరోసారి అగ్రపీఠాన్ని అధిరోహించాలని ఊవిళ్లూరుతున్నారు. ఈసారి కూడా చివరి నిమిషంలో తన ప్రచార బృందాన్ని మార్చి గెలుపొందాలని భావిస్తున్నారు. ఈ మార్పులు జో బైడెన్​పై విజయానికి దారిచూపిస్తాయని ఆశిస్తున్నారు.

పరిస్థితి మారింది, ఆయనా మారాలి!

అయితే 2020 ఎన్నికలు నాలుగు సంవత్సరాల క్రితం నాటి ఎన్నికలతో పోలిస్తే చాలా భిన్నమని చెప్పడానికి చాలా కారణాలున్నాయి. అందులో ప్రధానమైనది ట్రంప్ వైఖరి.

ఇదీ చదవండి:ఎన్నికల్లో ట్రంప్​ విజయం కోసం చైనా ప్రార్థనలు!

ఇప్పుడు అమెరికా పరిపాలనా వ్యవస్థకు అధినేత ట్రంప్. ఇదే సమయంలో దేశవ్యాప్తంగా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా నియంత్రణపై ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయి. దేశాన్ని కుదిపేసిన జాతి వివక్ష ఉదంతాలపై ట్రంప్ తీరును అమెరికన్లు ఎండగడుతున్నారు. కొంతమంది సొంతపార్టీ నేతలు సైతం ట్రంప్​ తీరుపై అసంతృప్తితో ఉన్నారు.

'ఇప్పుడు పరిష్కరించాల్సిన సమస్యలు ప్రచార బృందాన్ని మార్చడమో.. ఎన్నికలకు నూతన వ్యూహాలు అమలు చేయడమో కాదు. ట్రంప్​ తనకు తానే మార్చుకోవాలి.' అని కొంతమంది రిపబ్లికన్లు తమ మనోగతాన్ని బయటకు చెబుతున్నారు.

"చాలా మంది ప్రజలను ట్రంప్ దూరం చేసుకుంటున్నారు. ఇదే ట్రంప్ ప్రచారంలో ప్రధానమైన సమస్య. గెలవడానికి వీలు లేకుండా ట్రంప్ ఓటరు గణం ప్రమాదకరంగా తగ్గిపోతోంది."

-బ్రెండన్ బక్, రిపబ్లికన్ నేత

ఈ మార్పులన్నీ జరిగే వరకు ఎంత భారీ ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా నిరుపయోగమే. నిజానికి కొంతకాలంగా అమెరికన్లతో ట్రంప్ మమేకమైన దాఖలాలు పెద్దగా లేవు.

ఇదీ చదవండి:'ముందుంది మంచి కాలం- మళ్లీ నా గెలుపు తథ్యం'

కరోనా విషయంలో ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు గట్టి పట్టున్న ఫ్లోరిడా, టెక్సాస్, అరిజోనా రాష్ట్రాల్లో వైరస్ కేసులు పెరుగుతున్నప్పటికీ.. కరోనా అదుపులోనే ఉందని పదేపదే అంటున్నారు ట్రంప్. కరోనా నియంత్రణకు చాలానే చేశామని గొప్పలు చెప్పుకున్నారు. మహమ్మారిపై విజయం ప్రకటించడమే తరువాయి అన్నట్లు వ్యవహరించారు.

నల్లజాతీయుడైన ఆఫ్రో-అమెరికన్​ మృతి తర్వాత పోలీసు వ్యవస్థ ప్రక్షాళన చేయాలని వచ్చిన డిమాండ్​ను పెద్దగా పట్టించుకోలేదు ట్రంప్. ఈ విషయాన్ని పక్కనబెట్టి విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని నిరసనకారులపై మండిపడ్డారు.

ముందు గొప్పలు- వెనుక తిప్పలు

స్వయం ప్రకటిత నిశబ్ద మద్దతుదారుల గురించే ట్రంప్ సలహాదారులు గొప్పగా చెప్పుకుంటున్నారు. హిల్లరీ చేతిలో ట్రంప్ ఓడిపోతారని చెప్పిన ఆ నాటి సర్వేలను గుర్తుచేస్తున్నారు.

ఇదీ చదవండి:బెర్నీ-బైడెన్​ భాయిభాయి.. ట్రంప్ భవిష్యత్తు ఏం కానుంది?

ట్రంప్ ముందు ఎంత గొప్పలు చెప్పినా.. కొందరు సలహాదారులు, బయటి వ్యక్తులు మాత్రం తెరవెనక తమ మనసులోని అభిప్రాయాలను చెబుతున్నారు. ట్రంప్ పరిస్థితి అత్యంత ఘోరంగా ఉందని, మెరుగయ్యే సూచనలే కనిపించడం లేదని కుండ బద్దలుకొడుతున్నారు. మితవాద రిపబ్లికన్లు, స్వతంత్రులు, సబర్బన్ మహిళా ఓటర్లు చేజారుతున్నారనే ఆందోళన ట్రంప్ ప్రచార బృందంలో అధికమైందని చెబుతున్నారు. వీరంతా డెమొక్రటిక్ నేత జో బైడెన్​కు మద్దతిచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.

ప్రచారంలో మార్పులు

ఇదివరకు ప్రచార బృందాన్ని నడిపించిన బ్రాడ్ పార్స్కేల్​ను ఆ పదవి నుంచి తొలగించడం కూడా ట్రంప్ పొరబాట్లు సరిదిద్దుకునే ప్రయత్నమేనని తెలుస్తోంది. ఇప్పటికే ప్రచార నిర్వహణలో బ్రాడ్ పాత్ర పూర్తిగా తగ్గిపోయింది. ఆయన స్థానంలో పార్టీ కార్యనిర్వహక విషయాల్లో అనుభవం ఉన్న బిల్ స్టెపియన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

కొందరు రిపబ్లికన్లు ఈ మార్పును స్వాగతించారు. కానీ ప్రచారాన్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తున్నామని సంకేతం ఇస్తేనే లాభం ఉంటుందని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:'అమెరికా ఎన్నికల్లో రష్యా, చైనా జోక్యం వాస్తవం'

అయితే 2016తో పోలిస్తే ప్రస్తుత ట్రంప్ క్యాంపెయిన్​ బృందం మెరుగ్గానే ఉండేది. నాలుగేళ్ల క్రితం అనుభవం లేని సలహాదారుతో కూడిన చిన్న బృందంతో ఎన్నికలకు వెళ్లారు ట్రంప్. కానీ, ప్రస్తుతం తన రీఎలక్షన్ క్యాంపెయిన్​ను వేగంగా మార్చేశారు. అనుభవజ్ఞులైన రిపబ్లికన్లను తన బృందంలో చేర్చుకున్నారు. అడ్వర్టైజింగ్​ సహా క్షేత్ర స్థాయి కార్యక్రమాల కోసం భారీగా నిధులు సిద్ధం చేసుకున్నారు.

వైఫల్యాలు!

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థకు తోడు మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందడం వల్ల అమెరికా ఎకానమీ కుంటుపడింది. అయినప్పటికీ ట్రంప్​ను గెలిపించాలని ప్రచార బృందం ఓటర్లకు విజ్ఞప్తి చేస్తోంది.

ఇదీ చదవండి:ఈ విషయంలో మాత్రం ట్రంప్, బైడెన్​ది ఒకే మాట

జో బైడెన్​కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించడంలోనూ క్యాంపెయిన్ టీమ్ అష్టకష్టాలు పడుతోంది. హిల్లరీ క్లింటన్​ కన్నా ఎనిమిది సంవత్సరాల పాటు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బైడెన్​ గురించే అమెరికన్లకు బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు అనుసరించిన వ్యూహాలు విఫలం కాపడం వల్ల బైడెన్​పై విమర్శల డోసు పెంచాలని ట్రంప్​కు సలహాదారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చైనాకు బైడెన్ అనుకూలంగా వ్యవహరిస్తారని, ఉదారవాదుల చేతిలో బైడెన్ కీలుబొమ్మ అని ప్రచారం చేస్తున్నారు.

అప్పటి జ్ఞాపకాలతో డెమొక్రాట్లు

అదే సమయంలో ట్రంప్​ బలహీన స్థితిని డెమొక్రాట్లు ఉపయోగించుకుంటున్నారు. అయితే నాలుగేళ్లనాటి ట్రంప్ అనూహ్య విజయాన్ని సైతం దృష్టిలో ఉంచుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిని లోతుగా అంచనా వేస్తున్నట్లు స్పష్టం చేస్తున్నారు. కరోనా కారణంగా బైడెన్ క్యాంపెయిన్ భారీ స్థాయిలో ప్రచార సభలు నిర్వహించలేకపోయినా... అధ్యక్షుడితో త్వరలో జరగనున్న మూడు డిబేట్లకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని గుర్తిస్తున్నారు.

కరోనా సంక్షోభంలో ఇలాంటి పదునైన వ్యూహప్రతివ్యూహాలతో సాగుతున్న అమెరికా రాజకీయం ఎలాంటి మలుపు తిరుగుతుందో నవంబర్​లోనే తేలనుంది.

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details