క్రిస్మస్ వేడుకల్లో మునిగిన అమెరికాలో బాంబు పేలుడు తీవ్ర కలకలం రేపింది. టెనెస్సీలోని నాష్విల్లేలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఒకరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్లు, వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. భారీగా మంటలు ఎగిసి పడటంతో ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.