అమెరికాలోని అలస్కాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. పెర్రివిల్లే నగరానికి ఆగ్నేయ దిశగా 91 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.
అమెరికాలో భూకంపం- సునామీ హెచ్చరికలు జారీ -
అమెరికాలోని అలస్కాలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రత నమోదైంది. దీంతో అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేసింది అమెరికా సునామీ హెచ్చరికల కేంద్రం.
భూకంపం
భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. అక్కడ సునామీ హెచ్చరికలు జారీ చేసింది అమెరికా సునామీ హచ్చరికల కేంద్రం. పక్కనే ఉన్న మరో రాష్ట్రం హవాయిలోనూ సునామీ వచ్చే అవకాశముందని తెలిపింది. తీర ప్రాంతాల్లో విధ్వంసం జరిగే అవకాశముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Last Updated : Jul 29, 2021, 1:26 PM IST