కరోనా భయం నుంచి బయట పడాలంటే వీలైనన్ని ఎక్కువ పరీక్షలు నిర్వహిస్తూ కొత్త కేసుల్ని కనుగొని, మహమ్మారి ఎక్కువ మందికి వ్యాపించకుండా అడ్డుకోవాలని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా అనేక కొత్త పరికరాలు, యాప్‌లను పరిశోధకులు కనుగొంటున్నారు.
కరోనా సోకిందో లేదో స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకోండి! - america latest news
తమకు కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునే విధానాన్ని అమెరికాకు చెందిన పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆవిష్కరించారు. మనిషి శ్వాస ప్రక్రియలోని శబ్ద తరంగాలను కొలుస్తూ వాటిలో కలిగే మార్పులను నమోదు చేస్తూ ఒకవేళ వైరస్ సోకితే ఇట్టే పసిగట్టేలా దీనిని రూపొందించారు.
తమకు కరోనా సోకిందో లేదోననే విషయాన్ని ఇంట్లోనే ఉండి స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునే విధానాన్ని అమెరికాకు చెందిన పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఆవిష్కరించారు. 'కొత్త మొబైల్ సెన్సర్‌తోపాటు కృత్రిమ మేధను కలిపి ప్రాజెక్టులో ఉపయోగించాం. మనిషి శ్వాస ప్రక్రియలోని శబ్ద తరంగాలను కొలుస్తూ వాటిలో కలిగే మార్పులను నమోదు చేసేలా స్మార్ట్ ఫోన్‌లోని మైక్రోఫోన్లను, స్పీకర్లను తీర్చిదిద్దాం. ఇవి శ్వాసలోని శబ్దాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ ఒకవేళ వైరస్ సోకితే... ఆ మార్పులను పసిగడతాయి. ఈ మొత్తం వ్యవస్థ ఓ యాప్‌తో అనుసంధానమై ఉంటుంది. దానిని ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటే సరిపోతుంది' అని ఈ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్న ప్రొఫెసర్ వెయి గావో తెలిపారు.