రోమియో-జూలియెట్, పార్వతి-దేవదాసు, షాజహాన్-ముంతాజ్.., ప్రపంచానికి ఎప్పటికీ గుర్తుండిపోయే ప్రేమ జంటలు. ఇలాంటి అమర ప్రేమికులు ఎంతో మంది గురించి వినుంటాం, చూసుంటాం కూడా. అయితే ఫేస్బుక్ వేదికగా ఓ బంగ్లాదేశ్ యువకుడికి, అమెరికా యువతికి మధ్య చిగురించిన ప్రేమ.. ప్రస్తుతం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అంతేకాదు వీరి ప్రేమ పెళ్లిపీటలెక్కింది కూడా..! ఇంతకీ ఈ ప్రేమపక్షుల మధ్య స్నేహం ఎలా చిగురించింది? అది ఎలా ప్రేమగా మారిందంటే...
బంగ్లాదేశ్ బారిసల్ జిల్లా కౌనియాకు చెందిన 28 ఏళ్ల మైఖేల్ ఏపూ మాండోల్.., అమెరికాలోని మిన్నెసోటాకు చెందిన సారాకున్ (28)లు 2017 నవంబర్ 19న పేస్‌బుక్‌లోని ఓ గ్రూప్ ద్వారా పరిచయమయ్యారు. ఆ తర్వాత స్నేహితులయ్యారు. మెల్లగా చాటింగ్ మొదలెట్టారు. రోజులు గడిచేకొద్దీ సాధారణ మెసేజ్‌ల నుంచి రొమాంటిక్ మెసేజ్‌ల దాకా వెళ్లింది వీరి స్నేహం. అదే సమయంలో ఏపూతో ప్రేమలో పడింది సారా. ఇక అప్పటినుంచి ఫోన్‌కాల్స్, వీడియో కాల్స్‌తో వారి బంధం మరింత బలపడింది.
మొదటిసారి కలిసింది ఎక్కడంటే