అమెరికా క్యాపిటల్ భవనం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనం ఎదుట ప్రదర్శనలు(capitol protests) చేపట్టటం వల్ల.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులో ఉంచేందుకు పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించారు. పార్లమెంటు భవన పరిసరాల్లో ఫెన్సింగ్, బారికేడ్లతో పాటు వాహనాలను అడ్డుగా ఉంచారు.
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ.. ఈ ఏడాది జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు పార్లమెంటులోకి చొచ్చుకెళ్లి, దాడులకు పాల్పడ్డారు(capitol protests). ఇందుకు బాధ్యులను చేస్తూ ఇప్పటివరకూ 68 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం జైళ్లలో ఉన్న వీరందరికీ మద్దతుగా ట్రంప్ తరపు ప్రచారకర్త మట్ బ్రేనర్డ్ శనివారం ర్యాలీకి పిలుపునిచ్చారు. నిరసన తెలిపేందుకు 700 మందికి మాత్రమే అనుమతి ఇవ్వగా, అంతకంటే ఎక్కువమంది చేరుకోవడం భద్రత పరమైన ఆందోళనకు దారితీసింది.