కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌కు ప్రయాణించకూడదని తమ దేశ ప్రజలకు సూచించింది అమెరికా. పూర్తిగా టీకా తీసుకున్నవారు కూడా కొత్త వేరియంట్ల బారిన పడే ప్రమాదం ఉందని ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం(సీడీసీ) హెచ్చరించింది.
అత్యవసరమైతేనే భారత్‌కు వెళ్లండి: అమెరికా - భారత్‌కు ప్రయాణించొద్దన్న అమెరికా
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా భారత్‌కు ప్రయాణించడం శ్రేయస్కరం కాదని అమెరికా సూచించింది. భారత్‌లో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రకటన చేసింది ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం.
ప్రయాణికులు, అమెరికా ప్రయాణికులు
ఒకవేళ తప్పనిసరిగా భారత్‌కు వెళ్లాల్సి వస్తే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకున్నాకే ప్రయాణం చేయాలని సీడీసీ పేర్కొంది.
ఇదీ చదవండి:భారత్‌ను 'రెడ్ లిస్ట్'లో చేర్చిన బ్రిటన్