తెలంగాణ

telangana

ETV Bharat / international

మైక్​ టైసన్​, మహ్మద్​ అలీకి శిక్షణ ఇచ్చిన జిమ్ ఇదే...

అమెరికాలోని గ్లీసన్​ బాక్సింగ్​ వ్యాయామశాలకు 82 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉంది. ప్రపంచంలోని దిగ్గజ బాక్సర్లు మైక్​టైసన్​, మహమ్మద్​ అలీ, మేవెదర్​, మార్క్​ బ్రిలాండ్​ వంటివారూ ఇక్కడ తర్ఫీదు పొందినవారే... దశాబ్దాల క్రితం ప్రారంభమై 1200 మందితో నడుస్తోందీ ఈ బాక్సింగ్​ జిమ్​.

America's oldest active boxing gym - Gleason's
మైక్​ టైసన్​, మహ్మద్​ అలీకి శిక్షణ ఇచ్చిన జిమ్ ఇదే...

By

Published : Dec 29, 2019, 7:02 AM IST

అమెరికాలోని గ్లీసన్ బాక్సింగ్ జిమ్​ కేంద్రం

'గ్లీసన్ బాక్సింగ్ వ్యాయామశాల'​... అమెరికాలోనే అతి పురాతనమైనది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్ డంబో పరిసరాల్లో ఉన్న ఈ జిమ్ 1937లో ప్రారంభమైంది. బ్రూస్ సిల్వర్‌గ్లేడ్ అనే వ్యక్తి 40 ఏళ్లుగా దీని నిర్వహణ చూస్తున్నారు.

దశాబ్దాల చరిత్ర గల ఈ జిమ్​ సెంటర్ ఎంతో మంది ప్రపంచ ఛాంపియన్​లను అందించింది. రింగ్​లో అత్యంత ప్రమాదకరమైన మహమ్మద్ అలీ, మైక్ టైసన్​లను గ్లీసన్ జిమ్​ తీర్చిదిద్దింది. బాక్సింగ్ నేపథ్యంలో వచ్చిన హాలీవుడ్ సినిమాలు 'ర్యాగింగ్ బుల్', 'మిలియన్ డాలర్ బేబీ'ల చిత్రీకరణ ఇందులోనే జరిగింది.

ఈ వ్యాయామశాలను ప్రారంభించి 82 ఏళ్లయింది. అయినప్పటికీ ఇందులో 1200మంది శిక్షణ పొందుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు.

"ఈ జిమ్​ ప్రారంభమైనప్పటి నుంచి 136మంది ప్రపంచ ఛాంపియన్​లను అందించింది. 'జేక్​లా మోట్టా'తో మా విజయ ప్రస్థానం ఆరంభమైంది. ప్రస్తుతం ఇక్కడ ఏడుగురు అత్యుత్తమ బాక్సర్లకు శిక్షణనిస్తున్నాం. వారందరూ మహిళలే... ఇంత మంది మహిళలు ఒకేసారి శిక్షణనివ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. విజయం కోసం వారు తీవ్రంగా శ్రమిస్తూ, తర్ఫీదు పొందుతున్నారు."

- బ్రూస్ సిల్వర్‌గ్లేడ్, గ్లీసన్ బాక్సింగ్ జిమ్ యజమాని

ఇదీ చూడండి: రివ్యూ 2019: నరమేధం నుంచి నోబెల్​ శాంతి బహుమతి వరకు

ABOUT THE AUTHOR

...view details