అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతతో ఆస్పత్రిలో చేరారు. 75ఏళ్ల క్లింటన్.. కాలిఫోర్నియా యూనివర్సిటీ ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో మంగళవారం చేరారని వ్యక్తిగత సిబ్బంది ఏంజెల్ యురేనా తెలిపారు. అయితే ఆయనకు కొవిడ్ సంబంధిత ఇన్‌ఫెక్షన్లు ఏమీ సోకలేదని స్పష్టం చేశారు.
"ప్రస్తుతం క్లింటన్ బాగానే ఉన్నారు. ఆయనకు చికిత్స అందించిన వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు"