కరోనా వైరస్ నుంచి ఎన్-95 మాస్క్ కంటే మిన్నగా రక్షణ కల్పించే యాంటీమైక్రోబియల్ ఇరాడియేషన్ రెస్పిరేటర్ (ఏఐఆర్) పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు అమెరికాకు చెందిన ఒరాకిల్ లైటింగ్ అనే సంస్థ తెలిపింది. 'ఈ పరికరాన్ని మాస్క్ వెనుక ధరించడం ద్వారా.. పీల్చే గాలిని ఇది శుద్ధి చేస్తుంది. అలానే కొవిడ్-19 వంటి వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను అతినీలలోహిత కాంతితో నాశనం చేస్తుంది. ఎన్-95 మాస్క్ ధరించినా 5% వైరస్‌లు తప్పించుకుని లోపలికి వెళతాయి. ఆ ముప్పుని కూడా ఇది నివారిస్తుంది' అని ఆ సంస్థ శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
కరోనా నుంచి కాపాడే ఎన్-95 మాస్క్ కన్నా ఇదే మిన్న! - corona news
మాస్క్ ధరిస్తే కరోనా మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అందుకు ఎన్-95 మాస్క్‌లను సూచిస్తున్నారు. అయితే.. ఎన్-95 మాస్క్ ధరించినా 5 శాతం వైరస్‌లు తప్పించుకుని లోపలికి వెళతాయని.. ఆ ముప్పుని కూడా నివారించేలా యాంటీ మైక్రోబియల్ ఇరాడియేషన్ రెస్పిరేటర్ పరికరాన్ని రూపొందించినట్లు అమెరికాకు చెందిన ఒరాకిల్ లైటింగ్ సంస్థ తెలిపింది.
ఎన్-95 మాస్క్ కంటే మిన్నగా!
సాధారణంగా వైరస్‌ల నుంచి రక్షణకు వస్త్రంతో చేసిన మాస్క్‌లు ధరిస్తారు. వైరస్‌లు మాస్క్‌ల వెలుపలి పొరపై ఉండిపోయి.. అక్కడి నుంచి వేరేచోటుకి వ్యాపిస్తుంటాయి. ఈ పరిస్థితిని ఏఐఆర్ నివారిస్తుందని సంస్థ వెల్లడించింది. ఈ పరికరం ఇంకా మార్కెట్‌లోకి రాలేదు.