తెలంగాణ

telangana

ETV Bharat / international

శరీరాన్ని జీవ 'బ్యాటరీ'గా మార్చే పరికరం - జీవ బ్యాటరీ

మానవ శరీరాన్ని బ్యాటరీగా మార్చే చౌకైన పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీనిని శరీరాన్ని తాకేలా ధరించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇది మన సహజసిద్ధ వేడిని ఒడిసిపడుతుందని.. థర్మోడైనమిక్​ జెనరేటర్లను ఉపయోగించి ఈ వేడిని విద్యుత్​గా మారుస్తుందన్నారు.

american scientists developed a battery that takes energy from body to  be used for electronic gadgets
మానవ శరీరాన్ని జీవ బ్యాటరీగా మార్చే పరికరం

By

Published : Feb 14, 2021, 8:55 AM IST

మానవ శరీరాన్ని ఒక జీవ బ్యాటరీగా మార్చే చౌకైన పరికరాన్ని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. దీన్ని ఉంగరం, ముంజేతి గొలుసు తరహాలో.. శరీరాన్ని తాకేలా ధరించాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు. ఇది మన సహజసిద్ధ వేడిని ఒడిసిపడుతుంది. థర్మోడైనమిక్​ జెనరేటర్లను ఉపయోగించి ఈ వేడిని విద్యుత్​గా మారుస్తుంది. తమ ఆవిష్కారం వల్ల.. భవిష్యత్​లో శరీరంపై ధరించే ఎలక్ట్రానిక్ పరికరాలను సులువుగా ఉపయోగించుకోవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన జియాన్లింయాంగ్ షియావో పేర్కొన్నారు.

తాము రూపొందించిన బ్యాటరీ.. ప్రతి చదరపు సెంటీమీటరు చర్మం ద్వారా 1 వోల్టు శక్తిని వెలువరిస్తుందని వివరించారు. చేతి గడియారాలు, ఫిట్​నెస్​ ట్రాకర్లు వంటి సాధనాలకు శక్తిని అందించడానికి ఇది సరిపోతుందని తెలిపారు. షియావో బృందం రూపొందించిన పరికరానికి సాగే గుణం ఉంది. పైగా అది పూర్తిగా రీసైకిల్​కు యోగ్యంగా ఉంటుంది. దీంతో సంప్రదాయ ఎలక్ట్రానిక్స్​కు ఇది శుద్ధమైన ప్రత్యామ్నాయమవుతుంది. షియాగో నేతృత్వంలోని బృందం గతంలో ఎలక్ట్రానిక్​ చర్మం వంటి సాధనాలకు డిజైన్ చేసింది. ఈ ఆండ్రాయిడ్​ చర్మానికి వెలుపలి నుంచి శక్తి అందించాల్సి ఉంటుంది. తాజాగా పాలీఇమైన్​ అనే పదార్థం ద్వారా ఈ సాధనాన్ని తయారు చేశారు. దానిలో సన్నటి థర్మోఎలక్ట్రిక్​ చిప్​లను చొప్పించారు. వాటిని ద్రవ లోహపు వైర్లతో సంధానించారు.

ఇదీ చదవండి :కరోనా మ్యుటెంట్లు అన్నింటికీ ఒకటే వ్యాక్సిన్​!

ABOUT THE AUTHOR

...view details