జింక్ లేదా సి విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల కొవిడ్ బాధితుల్లో వ్యాధి లక్షణాల తీవ్రత లేదా సమయం పెద్దగా తగ్గవని ఆమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్ శాస్త్రవేత్తల తాజా పరిశోధన పేర్కొంది. సాధారణంగా.. రోగనిరోధక వ్యవస్థ పనితీరులో జింక్‌కు ముఖ్యమైన పాత్ర ఉంది. యాంటీబాడీ, తెల్లరక్త కణ ఉత్పత్తిలో, ఇన్ఫెక్షన్లపై పోరాటంలో అది సాయ పడుతుంది. యాంటీఆక్సిడెంట్ అయిన సి విటమిన్.. కణాలకు జరిగే నష్టాన్ని తగ్గించడంలో తోడ్పాటు అందిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
జింక్, సి విటమిన్‌తో ఊరట అంతంతే! - effects on zinc and vitamin c on corona
కొవిడ్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగించడంలో జింక్ లేదా సీ విటమిన్లు పోషించే పాత్రపై పరిశోధకులు కీలక విషయాలు వెల్లడించారు. అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో వీటి ప్రభావం అంతంత మాత్రమేనని తేలింది.
గతేడాది కొవిడ్ విజృంభణ తీవ్రమై, పెద్దసంఖ్యలో బాధితులు మృత్యువాత పడుతున్న తరుణంలో.. జింక్, విటమిన్ సప్లిమెంట్లతో ప్రయోజనం ఉంటుందన్న ఉద్దేశంతో ప్రజలు వీటికోసం ఎగబడ్డారని పరిశోధనకు నేతృత్వం వహించిన మిలింద్ దేశాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ -19 ఇన్ఫెక్షన్ను తగ్గించడంలో ఈ రెండింటి పాత్ర గురించి పరిశోధన చేపట్టామని తెలిపారు. 214 మంది రోగులపై ఈ అధ్యయనం సాగింది. వీరిలో కొందరికి 10 రోజుల పాటు జింక్ గ్లూకోనేట్ (50 ఎంజీ) లేదా విటమిన్ సి (8000 ఎంజీ) ఇచ్చారు. కొందరికి రెండు రకాల మందులనూ అందించారు. మిగతావారికి ప్రామాణిక సంరక్షణ విధానాన్ని అందించారు. వ్యాధి లక్షణాల నుంచి ఉపశమనం విషయంలో ఈ బృందాల మధ్య పెద్దగా వైరుధ్యం లేదని తేల్చారు.
ఇదీ చదవండి :ప్రకృతి శాపం.. మనిషిదీ పాపం!