తెలంగాణ

telangana

ETV Bharat / international

చిన్నారి కిడ్నాప్​.. అరగంటలో ఛేదించిన పోలీసులు - అమెరికా కిడ్నాప్ గణాంకాలు

ఆరుబయట సైకిల్ తొక్కుతున్న ఆరేళ్ల చిన్నారిని గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు 30నిమిషాల్లోనే కేసును ఛేదించారు. చిన్నారిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.

Video: Police rescue girl snatched from bike
చిన్నారి అపహరణ.. అరగంటలో ఛేదించిన పోలీసులు!

By

Published : Jul 9, 2021, 4:41 PM IST

Updated : Jul 9, 2021, 4:52 PM IST

చిన్నారి అపహరణ.. అరగంటలో ఛేదించిన పోలీసులు!

అమెరికాలోని లూయిస్​విల్లే ప్రాంతంలో అపహరణకు గురైన చిన్నారి కథ సుఖాంతం అయింది. కేవలం 30 నిమిషాల్లోనే ఛేదించి.. దుండగులను పట్టుకున్నారు పోలీసులు. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదీ జరిగింది..

ఈనెల 2వ తేదీన తన ఇంటి ప్రాంగణంలో సైకిల్ తొక్కుతున్న చిన్నారిని అపహరించారు దుండగులు. చట్టుపక్కలవారు అందించిన సమాచారంతో.. వేగంగా స్పందించారు పోలీసులు. కారు గుర్తులను బట్టి 30 నిమిషాల్లోనే కేసును ఛేదించారు. కిడ్నాపర్ రాబీ వైల్డ్​ను అరెస్టు చేశారు. అయితే అతను నేరాన్ని అంగీకరించలేదు.

తాత్కాలిక నంబర్​ ప్లేట్​తో ఉన్న ఓ వాహనంలో నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎమర్జెన్సీ నెంబర్ 911కు ఫోన్ చేసి వాహన గుర్తులను తెలిపారు.

"వీధి చివరన ఒక కారు నిలిపి ఉంచడాన్ని నేను చూశా. అందులోంచి దిగిన ఓ వ్యక్తి చిన్నారి కాలర్ పట్టుకుని ఆమె సైకిల్​ను విసిరేశాడు. అతని వాహనాన్ని వెంబడించా. నెంబర్​ ప్లేట్​ను చూసి పోలీసులకు సమాచారం అందించా."

- ప్రెంటిస్ వెదర్‌ఫోర్డ్, ప్రత్యక్ష సాక్షి

తాము కిడ్నాపర్​ను సమీపించేసరికి 'ఐ వాంట్ మై డాడీ' అంటూ చిన్నారి ఏడుస్తోందని ఓ పోలీసు అధికారి తెలిపారు. దుండగుల బారినుంచి సురక్షితంగా కాపాడినట్లు చెప్పారు.

తమ కూతురుని సురక్షితంగా అప్పగించినందుకు చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 9, 2021, 4:52 PM IST

ABOUT THE AUTHOR

...view details