తెలంగాణ

telangana

ETV Bharat / international

'2022 బీజింగ్​ ఒలింపిక్స్​ దౌత్యపరంగా బహిష్కరణ' - జో బైెడెన్ వింటర్ ఒలింపిక్స్

America Winter Olympics: 2022లో చైనాలో జరగబోయే ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది. అమెరికాకు చెందిన అథ్లెట్లు.. ఒలింపిక్స్​లో పాల్గొంటారు కానీ అధికారులను మాత్రం పంపించబోమని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ జెన్​ సాకి తెలిపారు.

america
జో బైడెన్

By

Published : Dec 7, 2021, 11:19 AM IST

America Winter Olympics: 2022, బీజింగ్​ ఒలింపిక్స్​ను దౌత్యపరంగా బహిష్కరిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. అమెరికా అథ్లెట్లు మాత్రం ఒలింపిక్స్​లో పాల్గొంటారని, కానీ ప్రభుత్వ అధికారులను తాము పంపబోమని శ్వేతసౌధం ప్రెస్​ సెక్రటరీ జెన్​ సాకి తెలిపారు. బీజింగ్​లో జరగనున్న పారాలింపిక్​ గేమ్స్​కూ ఇదే విధానం వర్తిస్తుందన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడే దేశాలతో తాము వ్యాపారాలు, సంబంధాలు పెట్టుకోమన్న సందేశాన్ని పంపేందుకే శీతాకాల ఒలిపింక్స్​ను రద్దు చేసినట్లు సాకి వివరించారు.

బీజింగ్ ఒలింపిక్స్​ను బహిష్కరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు నవంబర్​లోనే బైడెన్ చెప్పారు. అదే నెలలో ఇరు దేశాధినేతల మధ్య జరిగిన వర్చువల్​ భేటీలోనూ ఒలింపిక్స్​ విషయం చర్చలోకి రాలేదు.

చైనా.. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని.. ముఖ్యంగా దేశంలో మైనారిటీ ముస్లింలుగా ఉన్నా ఉయ్ఘర్లను చిత్రహింసలకు గురి చేస్తున్న క్రమంలో అమెరికా ప్రభుత్వం 2022 శీతాకాల ఒలింపిక్స్​ను నిషేధించింది.

ఇదీ చూడండి:హాంకాంగ్​లో చైనా మరో చట్టం.. ఈసారి మీడియా, ఇంటర్నెట్​పై!

ABOUT THE AUTHOR

...view details