తెలంగాణ

telangana

ETV Bharat / international

200 మైళ్ల మేర చుట్టేసిన టోర్నడో- 70కి చేరిన మృతులు

America Tornado: అమెరికా కెంటకీ రాష్ట్రంలో టోర్నడో ధాటికి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 70కి చేరింది. పెనుగాలులతో కూడిన తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో వీరంతా మరణించారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

America Tornado
అమెరికాలో టోర్నడో

By

Published : Dec 12, 2021, 4:51 AM IST

America Tornado: అమెరికా ఈశాన్య రాష్ట్రం కెంటకీలో టోర్నడో కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మరింత పెరిగింది. పెనుగాలులతో కూడిన ఈ తుపాను ధాటికి వేర్వేరు ఘటనల్లో సుమారు 70 మంది మరణించారని ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బెషియర్‌ తెలిపారు. రాష్ట్రంలో సుమారు 200 మైళ్ల మేర పలు కౌంటీలను బలమైన టోర్నడో చుట్టేసిందని, కెంటకీ చరిత్రలోనే ఇది అత్యంత తీవ్రమైనదని పేర్కొన్నారు. మృతుల సంఖ్య 100 వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

"కొవ్వొత్తుల తయారీ కర్మాగారం పైకప్పు కుప్పకూలటం వల్ల భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఆ సమయంలో 110 మంది ఆ కర్మాగారంలో ఉన్నారు. శుక్రవారం రాత్రి అత్యంత దుర్భరమైనది. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నాం. సహాయక చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించాం. శిథిలాల తొలగింపు కొనసాగుతోంది."

-ఆండీ బెషియర్​, కెంటకీ రాష్ట్ర గవర్నర్​

దాదాపు ఐదడుగుల ఎత్తున కర్మాగార శిథిలాల్లో రెండు గంటలకు పైగా చిక్కుకుపోయి సురక్షితంగా బయటపడ్డ ఉద్యోగిని పార్సన్స్‌ పెరెజ్‌ ఆ విషయంలో గ్రేవ్స్‌ కౌంటీ కారాగార ఖైదీలకు కృతజ్ఞతలు తెలిపారు బెషియర్. అవకాశం వచ్చినా పారిపోకుండా వారంతా వచ్చి తనలాంటివారికి సాయపడ్డారని చెప్పారు.

అమెరికాలో టోర్నడో బీభత్సానికి ధ్వంసమైన ఇల్లినోయీలోని అమెజాన్‌ గిడ్డంగి
మేఫీల్డ్‌లో కుప్పకూలిన కొవ్వొత్తుల కర్మాగారం
.

అంతా అస్తవ్యస్తం..

joe biden on tornado: కెంటకీలోని బౌలింగ్‌ గ్రీన్‌ ప్రాంతంలో అనేక అపార్ట్‌మెంట్లు భారీగా దెబ్బతిన్నాయి. కొన్ని కర్మాగారాలు కూలిపోయాయి. రహదారులపై శిథిలాలు పడి ఉండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. టోర్నడో ప్రభావం ఆరు రాష్ట్రాలపై పడింది. ఇల్లినోయీలో అమెజాన్‌ గిడ్డంగి పైకప్పు ఎగిరిపోయి, భారీ గోడ కూలిపోయింది. అలాస్కాలో ఓ నర్సింగ్‌హోం దెబ్బతింది. పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. మిస్సౌరి, మిసిసిపి, ఆర్కాన్సాస్‌, టెన్నెసీలపైనా టోర్నడో విరుచుకుపడింది. విద్యుత్తు సరఫరా స్తంభించిపోయి దాదాపు 3 లక్షలమంది అంధకారంలో చిక్కుకుపోయారు. అత్యవసరమైతే తప్పిస్తే బయటకు రావద్దని పలుచోట్ల అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశాధ్యక్షుడు జో బైడెన్‌ తాజా పరిస్థితిని సమీక్షించారు.

ఇదీ చూడండి:రావత్​ హెలికాప్టర్​ ప్రమాదంపై చైనా అవహేళన

ABOUT THE AUTHOR

...view details