అమెరికాలో లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తే భారీ సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడతారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంటోనీ ఫౌచి. సెనేట్‌లోని ప్యానెల్‌కు ఈ మేరకు కొన్ని సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తూ కొన్ని రాష్ట్రాలు ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులివ్వడాన్ని ట్రంప్ ప్రశంసించిన తర్వాత ఈ వ్యాఖ్యలు చేశారు ఫౌచి.
పాజిటివ్ కేసుల ఆధారంగా దశలవారీగా లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని సూచించారు ఫౌచి. రెండు వారాలుగా కేసుల తీవ్రతను అంచనా వేస్తూ.. కాంటాక్ట్ ట్రేసింగ్, నిఘా వ్యవస్థ ఆధారంగా వైరస్ అనుమానితులను గుర్తించాలని చెప్పారు. నర్సింగ్ హోమ్‌లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి సత్వర వైద్య సేవలు అందించాలని కోరారు.