తెలంగాణ

telangana

By

Published : Aug 6, 2021, 5:48 AM IST

ETV Bharat / international

అమెరికాలో వ్యాన్‌ బోల్తా.. 10 మంది మృతి

అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది అక్రమ వలసదారులు మృతి చెందారు.

america
america

దక్షిణ టెక్సాస్‌లో ఓ వ్యాన్‌ అదుపు తప్పి 10 మంది అక్రమ వలసదారులు మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. వ్యాన్‌ సామర్థ్యాన్ని(15) మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వలనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ఇలా వ్యాన్లలో అక్రమంగా అమెరికాలోకి వలసదారులను స్మగ్లింగ్‌ చేయడం ఈ ప్రాంతంలో సర్వసాధారణమే.

అయితే పోలీసుల భయంతో వ్యాన్లను విపరీత వేగంతో నడపడం వలన ఇటీవల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇదీ చదవండి:ఘోర రోడ్డు ప్రమాదం.. 41 మంది మృతి

ABOUT THE AUTHOR

...view details