అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కీలకమైన రీఏజెంట్ రసాయనాల అవసరం లేకుండానే కొవిడ్-19 పరీక్షను నిర్వహించేందుకు కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కొవిడ్-19 నిర్ధారణకు 'రివర్స్ ట్రాన్స్క్రిప్షన్' పాలిమరేజ్ చెయిన్ రియాక్షన్ ( ఆర్టీ-పీసీఆర్) పరీక్ష ప్రామాణికంగా ఉంది. ఇందులోని ఒక దశలో అరుదైన రీఏజెంట్లు అవసరం.
రీఏజెంట్ల అవసరం లేకుండానే కొవిడ్ నిర్ధారణ పరీక్ష - కరోనా పరీక్షలు
కీలకమైన రీఏజెంట్ రసాయనాల అవసరం లేకుండానే కొవిడ్-19 పరీక్షను నిర్వహించేందుకు అమెరికాలోని వాషింగ్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఒక కొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనితో చేసిన తాజా పరీక్షల్లో 92శాతం కచ్చితత్వంతో ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు పేర్కొన్నారు.
రీఏజెంట్ల అవసరం లేకుండానే కొవిడ్ నిర్ధారణ పరీక్ష
తాజాగా అభివృద్ధి చేసిన పరీక్షల్లో ఈ దశ అవసరం ఉండదు. అయినా 92శాతం కచ్చితత్వంతో ఫలితాలను ఇస్తోంది. వైరల్ లోడ్ చాలా తక్కువగా ఉన్న సందర్భాల్లోనే ఇది కరోనా జాడను పట్టుకోలేదని పరిశోధనలో పాలుపంచుకున్న జాసన్ బోటెన్ తెలిపారు. ఆర్టీ-పీసీఆర్ పరీక్షలో మూడు అంచెలు ఉన్నాయని, తాజా విధానంలో రెండు దశలకే పరిమితమని ఆయన వెల్లడించారు.
- పీసీఆర్‌లోని మొదటి దశలో.. వ్యక్తి ముక్కు నుంచి స్వాబ్ ద్వారా నమూనాను సేకరించి, దాన్ని ఒక ద్రవం లేదా మాధ్యమంలో ఉంచుతారు. ఫలితంగా స్వాబ్లోని వైరస్ ఆ ద్రవంలోకి వెళ్తుంది.
- రెండో దశలో ఆ ద్రవంలోని స్వల్ప నమూనాను తీసుకుని దానికి రీఏజెంట్లను జోడిస్తారు. వైరస్‌లోని ఆర్ఎన్ఏను వెలికితీసేందుకు ఇది అవసరం.
- మూడో దశలో.. నమూనాలోని వైరస్ జన్యు పదార్థాలను మరింతగా పెంచేందుకు ఇతర రసాయనాలను కలుపుతారు. అంతిమంగా ఈ నమూనాలో వైరస్ ఉంటే.. పాజిటివ్ సంకేతం వస్తుంది.
ఈ మూడు దశల గురించి చెప్పిన జాసన్.. కొత్త విధానంలో స్వాబ్‌ను ఒక ద్రవంలో ఉంచాక నేరుగా మూడో అంచెలోకి వెళ్లిపోవచ్చని వివరించారు.