అమెరికాలో 2016 నాటి ఎన్నికల్లో రష్యా ప్రమేయానికి సంబంధించి ఉన్న అన్నిరకాల అధికారిక పత్రాలను బహిర్గతం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం తన యంత్రాంగాన్ని ఆదేశించారు. నాటి ఎన్నికల్లో రష్యా జోక్యం అంతా బూటకమని ట్రంప్ తొలి నుంచీ వాదిస్తున్నారు.
ఒబామాకు రాసిన లేఖ
తాజాగా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ నుంచి కొన్ని పత్రాలు బహిర్గతమయ్యాయి. నాటి డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రైవేటు ఈమెయిల్ సర్వర్ వివాదం నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా.. ఆమె ప్రత్యర్థి ట్రంప్‌ను రష్యాతో ముడిపెట్టాలంటూ మాజీ సీఐఏ డెరెక్టర్ జాన్ బ్రెన్నాన్.. అధ్యక్షుడు ఒబామాకు రాసిన లేఖ ఒకటి ఆ పత్రాల్లో ఉందని ఫాక్స్ న్యూస్ పేర్కొంది. ఆ తర్వాత కొన్ని గంటలకే ట్రంప్ ఈ ఆదేశాలు జారీ చేశారు.