నకిలీ విశ్వవిద్యాయాలకు అనుమతిచ్చి అమెరికా ప్రభుత్వమే భారతీయ విద్యార్థులను తప్పుదోవ పట్టించిందని భారతీయ అమెరికన్ న్యాయవాది పెషావారియా ఆరోపించారు. తప్పుడుదైన 'యూనివర్సిటీ ఆఫ్ ఫార్మింగ్టన్'ను డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌లాండ్ సెక్యూరిటీనే అనుమతించిందని ఆరోపించారు.
అమెరికాలో ఉండాలన్న ఆశతో భారత విద్యార్థులు అన్నీ తెలిసినా అక్రమంగా వచ్చి నేరానికి పాల్పడ్డారని అమెరికా అధికారులు మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత విద్యార్థులు నిజంగా తప్పుచేసుంటే శిక్షించండని పెషావారియా స్పందించారు.