తుపాకుల సంస్కృతితో అలరారే అమెరికాలో నూతన సంవత్సర వేళ కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. ఫ్లోరిడాలోని ఓ క్లబ్‌లో జరిగిన కొత్త ఏడాది వేడుకల్లో ఓ ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అందరూ వేడుకల్లో మునిగి ఉన్న సమయంలో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. నిందితుడు కాల్పులు జరిపే సమయంలో బయట భద్రతా సిబ్బంది ఉన్నారని ఆరెంజ్ కౌంటీ షెరీఫ్ అధికారులు వెల్లడించారు.
నూతన ఏడాది వేడుకల్లో కాల్పులు-ఇద్దరు మృతి - two died, five injured in america firing
అగ్రరాజ్యం అమెరికాలో రెండు వేర్వేరు కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. నూతన సంవత్సర వేడుకలే లక్ష్యంగా ఆగంతుకులు కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఐదుగురికి గాయాలయ్యాయి.
అమెరికా నూతన ఏడాది వేడుకల్లో కాల్పులు
హంటింగ్డన్‌లోని ఓ బార్ లోపల కూడా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. హుక్కా బార్‌లో నూతన సంవత్సర వేడుకలు జరుగుతుండగా అకస్మాత్తుగా కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో సుమారు ఐదుగురికి గాయాలయ్యాయి. కాల్పులు జరిగిన సమయంలో బార్‌లో సుమారు 50 మంది వరకు ఘటనా స్థలంలో ఉన్నారని హంటింగ్టన్ పోలీస్ చీఫ్ రే కార్నెవాల్ తెలిపారు.
ఇదీ చూడండి: భారత సైన్యాధ్యక్షుడి వ్యాఖ్యలు బాధ్యతా రహితం: పాక్