తెలంగాణ

telangana

ETV Bharat / international

కొవిడ్​ మాత్ర​ వినియోగానికి అమెరికా ఎఫ్​డీఏ సానుకూలం! - america food and drugs administration

Covid pill merck: కొవిడ్​ ఔషధం మోల్నూపిరవిర్​ వినియోగంపై అమెరికా ఫుడ్​ అండ్ డ్రగ్స్​ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ)కు చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. గర్భిణులు ఈ ఔషధాన్ని వినియోగిస్తే శిశువులు పుట్టుకతో వచ్చే లోపం వంటి సమస్యలు ఎదుర్కోలేదని తెలిపింది. కొవిడ్ బారినపడ్డ వయోజనులకు ఈ ఔషధం సమర్థంగా పని చేస్తుందని చెప్పింది.

COVID-19 pill Merck, corona pill
కొవిడ్​ పిల్

By

Published : Dec 1, 2021, 10:42 AM IST

Covid pill merck: అంతర్జాతీయ ఫార్మా సంస్థ మెర్క్ రూపొందించిన కొవిడ్ ఔషధం మోల్నూపిరవిర్(Molnupiravir) వినియోగంపై అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మనిస్ట్రేషన్​కు(ఎఫ్​డీఏ) చెందిన ఆరోగ్య సలహాదారుల కమిటీ సానుకూలంగా స్పందించింది. దీంతో ఈ ఔషధం.. త్వరలోనే అమెరికా పౌరులు వినియోగించేందుకు మార్గం సుగమం అయింది. గర్భధారణ సమయంలో ఈ ఔషధాన్ని వినియోగిస్తే.. శిశువులకు పుట్టుకతో వచ్చే లోపాలు రావని, వివిధ ముప్పులను అధిగమిస్తుందని కమిటీలో 13-10 మంది ఓటు వేశారు. ఈ ఔషధ ప్రయోజనాలపై విస్తృత చర్చ జరిగిన తర్వాత ఈ మేరకు కమిటీ ఆమోదించింది. ఈ ఔషధాన్ని గర్భిణులు ఉపయోగించే విషయంపై దృష్టిసారించాలని ఎఫ్​డీఏకు కమిటీ సూచించింది.

Fda on covid pill: వృద్ధులు, ఆస్తమా, ఊబకాయం వంటి వ్యాధులు ఉన్నవారు సహా అత్యధిక ముప్పును ఎదుర్కొనే వయోజనులు ఈ ఔషధం ఉపయోగించవచ్చని కమిటీ తెలిపింది. వ్యాక్సిన్ తీసుకున్నవారు ఈ ఔషధాన్ని వినియోగించవచ్చా? వద్దా? అన్నదానిపై పరిశోధన జరగనందున... వారు ఈ మాత్రను వినియోగించకూడదని కమిటీలో చాలా మంది సభ్యులు పేర్కొన్నారు. మోల్నూపిరవిర్ మాత్రపై ప్యానెల్ చేసిన సూచనలపై ఎఫ్​డీఏ పూర్తిగా ఆధారపడదు. ఈ ఏడాది చివరికల్లా ఈ ఔషధ అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపే విషయంపై సొంతంగా నిర్ణయం తీసుకోనుంది.

Omicron covid pill: కరోనాను ఎదుర్కోవడంలో మోల్నుపిరవిర్ సమర్థంగా పని చేస్తుందని పరిశోధనల్లో తేలింది. కరోనా కొత్త వేరియంట్​ను ఎదుర్కోగలదా? లేదా? అని అధికారులు పరిశీలిస్తున్నారు. ఒమిక్రాన్​పై ఈ పిల్ సామర్థ్యాన్ని ఇంకా పరిశీలించనప్పటికీ.. కొంతమేర ప్రభావవంతంగానే పని చేస్తుందని వారు భావిస్తున్నారు. "కరోనా కొత్త వేరియంట్లను మోల్నుపిరవిర్ ఎదుర్కొంటుందనడానికి ఆధారం లేదు. దీని గురించి ప్రకటించే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి" అని చార్లెస్ డ్రూ యూనివర్సిటీ స్కూల్ మెడిసిన్ అండ్ సైన్సెస్​కు చెందిన డాక్టర్ డేవిడ్ హార్డీ తెలిపారు. ఎఫ్​డీఏ ఆరోగ్య నిపుణుల కమిటీలో ఆయన కూడా సభ్యుడిగా ఉన్నారు.

ఇదీ చూడండి:కరోనాకు పిల్​తో చెక్- ఆ మాత్రల వినియోగానికి యూకే ఓకే
ఇదీ చూడండి:కరోనా చికిత్సకు ఫైజర్​ 'పిల్​'- 90% తగ్గిన మరణాలు!

ABOUT THE AUTHOR

...view details