తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు! - us to ask corona test report

అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించే దిశగా చర్యలు చేపడుతోంది అమెరికా. తమ దేశానికి వచ్చే విదేశీయులు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిచ్చేందుకు సిద్ధమవుతోంది. జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది.

america-expected-to-require-corona-tests-for-all-international-passengers
అంతర్జాతీయ ప్రయాణికులపై అమెరికా ఆంక్షలు!

By

Published : Jan 13, 2021, 5:47 AM IST

కరోనా స్ట్రెయిన్‌ వ్యాప్తి ఉద్ధృతి నేపథ్యంలో ప్రయాణికులపై ఆంక్షలను పొడిగించేందుకు అమెరికా సిద్ధమవుతోంది. అమెరికాకు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు విమానం ఎక్కేముందు కచ్చితంగా కరోనా నెగటివ్‌ ధ్రువప్రతం చూపిస్తేనే అనుమతిచ్చే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ మేరకు యూఎస్‌ సెంటర్స్‌ ఫర్‌ డీసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ) త్వరలోనే ఉత్తర్వులు జారీ అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఉత్తర్వులు జారీ అయితే జనవరి 26 నుంచి ఈ నిబంధన అమల్లోకి రావచ్చని పేర్కొంటున్నారు. ఇప్పటికే సీడీసీ, ఇతర పరిపాలన అధికారులు దీనిపై కసరత్తు చేస్తున్నారు.

యూకేలో కరోనా స్ట్రెయిన్‌ ఉద్ధృతి నేపథ్యంలో ఇప్పటికే అమెరికా ఆ దేశం నుంచి వచ్చే ప్రయాణికులపై ఆంక్షలు పెట్టింది. అయితే పలు దేశాల్లోనూ కరోనా కొత్త రకం వ్యాప్తి వెలుగుచూస్తుండడంతో అన్ని దేశాల ప్రయాణికులపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సీడీసీ ఉత్తర్వులు అమల్లోకి వస్తే ఇతర దేశాల నుంచి అమెరికాకు వచ్చే ప్రయాణికులతో పాటు, విదేశాలకు వెళ్లి అమెరికాకు రానున్న తమ సొంత పౌరులకు కూడా ఇది వర్తించనుంది.

ఇదీ చూడండి: నాపై అభిశంసన తీర్మానం హాస్యాస్పదం: ట్రంప్​

ABOUT THE AUTHOR

...view details