భారత ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం మిషన్శక్తిపై అమెరికా స్పందించింది. అంతరిక్ష, సాంకేతిక రంగాల్లో భారత్తో తమకున్న బంధాన్ని కొనసాగిస్తామని అగ్రరాజ్యం స్పష్టం చేసింది. కానీ అంతరిక్ష వ్యర్థాల సమస్యపై ఆవేదన వ్యక్తం చేసింది.
"భారత్ చేపట్టిన మిషన్శక్తి ప్రయోగం నివేదికను గమనించాం. అమెరికా ప్రభుత్వానికి అంతరిక్ష వ్యర్థాల సమస్య ఎంతో ముఖ్యం. వాటిని దృష్టిలో పెట్టుకునే ప్రయోగం చేశామని భారత్ తెలిపింది."
-అమెరికా ప్రభుత్వ ప్రతినిధి