తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెజాన్​ బాస్​ విడాకులకు $ 3,830 కోట్ల డీల్​ - Jeff Bezos

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​, ఆయన భార్య మెకంజీ మధ్య 38 బిలియన్​ డాలర్లు విలువైన ఒప్పందంతో విడాకులు ఖరారయ్యాయి. తన సంపదలో సగభాగాన్ని జెఫ్​కే అప్పగిస్తానని మెకంజీ ప్రకటించారు.

జెఫ్​ బెజోస్​ దంపతులకు విడాకులు ఖరారు

By

Published : Jul 6, 2019, 3:55 PM IST

ప్రపంచంలో అత్యంత ధనవంతుడు, అమెజాన్​ వ్యవస్థాపకుడు జెఫ్​ బెజోస్​, ఆయన భార్య మెకంజీ బెజోస్​కు విడాకులు ఖరారయ్యాయి. వీరిరువురి మధ్య 38.3 బిలియన్ డాలర్లకు విడాకుల ఒప్పందం కుదిరిందని ఓ వార్తా సంస్థ తెలిపింది.

వాషింగ్టన్​ కింగ్​ కౌంటీ న్యాయస్థానంలో ఖరారైన ఈ ఒప్పందం ప్రకారం... 49 ఏళ్ల మెకంజీ బెజోస్​కు అమెజాన్​.కామ్​లో నాలుగు శాతం వాటం(సుమారు 19.7 మిలియన్ షేర్లు) దక్కుతుంది. ఈ షేర్ల విలువ 3,830 కోట్ల డాలర్లు. ఫలితంగా ఆమె బ్లూమ్​బెర్గ్​ బిలియనీర్స్ ఇండెక్స్​లో 22వ స్థానానికి చేరనున్నారు.

విడాకుల ఒప్పందం తర్వాత అమెజాన్​లో జెఫ్​ బెజోస్​కు 12శాతం ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడి హోదా అలానే ఉండనుంది.

జెఫ్​కే అన్నీ...

నవలా రచయిత్రి అయిన మెకంజీ బెజోస్... వాషింగ్టన్ పోస్ట్, అంతరిక్ష పరిశోధన సంస్థ 'బ్లూ ఆరిజన్'​లోని తనకున్న వాటాలను జెఫ్​కు ఇస్తానని ప్రకటించారు. అలాగే తనకున్న అమెజాన్ స్టాక్​ల ఓటింగ్ హక్కులనూ ఆయనకే అప్పగిస్తానని వెల్లడించారు.

సగభాగం స్వచ్ఛంద సంస్థలకే...

మెకంజీ బెజోస్​ తనకున్న సంపదలో సగభాగాన్ని 'గివింగ్ ప్లెడ్జ్​'లో భాగంగా స్వచ్ఛంద సంస్థలకు విరాళామనిస్తానని ప్రకటించారు.
ఇలా విడిపోయారు..

జెఫ్ బెజోస్, మెకంజీ 25 ఏళ్ల పాటు అన్యోన్యంగా దాంపత్య జీవితాన్ని గడిపారు. వీరికి నలుగు సంతానం. అమెజాన్​ సంస్థ స్థాపించిన తరువాత వీరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులుగా ఎదిగారు. అయితే జెఫ్​కు మరో మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాన్ని ఓ వార్తాపత్రిక బయటపెట్టిన కారణంగా వీరిరువురూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. చివరకు విడాకులు తీసుకున్నారు.

ఇదీ చూడండి:- ఏ క్షణమైనా కుమారస్వామి సర్కార్​ పతనం!

ABOUT THE AUTHOR

...view details