తెలంగాణ

telangana

ETV Bharat / international

అంతర్జాల సేవలకు ఆమెజాన్ ఉపగ్రహం!

మీ ప్రాంతంలో అంతర్జాల సేవలు లేవా? లేక తక్కువ స్పీడ్​ ఇంటర్నెట్ సేవల​తో విసిగిపోతున్నారా?  మీ సమస్యలకు కొన్నేళ్లలో పరిష్కారం లభించనుంది. 3,236 ఉపగ్రహాలతో 'ప్రాజెక్ట్​ క్యూపర్' చేపట్టింది ఆమెజాన్.

By

Published : Apr 5, 2019, 7:40 PM IST

అంతర్జాల సేవలకు ఆమెజాన్ ఉపగ్రహం!

ఇప్పడు ప్రపంచమంతా అరచేతిలోనే ఉంది. అంతర్జాలంతో ఏ సమాచారమైనా చిటికెలో పొందుతున్నాం. స్మార్ట్​ఫోన్​ వినియోగదారుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కానీ ఈ కాలంలోనూ ప్రాథమిక ఇంటర్నెట్​ సేవలు లేని వారు ఎందరో ఉన్నారు. వారికోసం ఆన్​లైన్​ మార్కెటింగ్​ దిగ్గజ సంస్థ ఆమెజాన్​ 'ప్రాజెక్ట్​ క్యూపర్'​ను అందుబాటులోకి తెచ్చింది.

"భూ కక్ష్యలో ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేయడమే ఈ ప్రాజెక్ట్​ క్యూపర్​. దీనితో ప్రపంచవ్యాప్తంగా ప్రాథమిక సదుపాయం లేనివారు అధికంగా లబ్ధి పొందుతారు. సేవలు తక్కువున్న ప్రాంతాలూ లాభపడతాయి."
--- ఆమెజాన్​

ఈ ప్రాజెక్ట్​ కోసం ఎన్నో బిలియన్​ డాలర్లను వెచ్చించడానికి ఆమెజాన్​ సిద్ధపడింది. ఇది కార్యరూపం దాల్చితే కొన్ని కోట్ల మంది లబ్ధి పొందుతారు. ఈ విషయాలను అమెరికాకు చెందిన 'గీక్​వైర్​' వెబ్​సైట్​ స్పష్టం చేసింది.

భూమికి 590-620 కిలోమీటర్ల ఎత్తులో 3వేల 236 ఉపగ్రహాలను ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించింది ఆమెజాన్​.

సుదూర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాలు అందించడానికి ఉపగ్రహాలను ఉపయోగించాలని కోరుతున్న అనేక కంపెనీలలో ఆమెజాన్ ఒకటి. ఈ జాబితాలో స్పేస్​ ఎక్స్​, వన్​వెబ్​ ఉన్నాయి.

ఇదీ చూడండి: కోడిపిల్ల బుజ్జిగాడికి... బుల్లి బహుమతి

ABOUT THE AUTHOR

...view details