ఒక సంవత్సరం పాటు తమ ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను అమెరికన్ పోలీసులు వినియోగించకుండా నిషేధించింది అమెజాన్. అయితే ఈ నిర్ణయానికి గల కారణాలను ఈ-కామర్స్ దిగ్గజం వెల్లడించలేదు.
అనుమానితులను గుర్తించేందుకు పోలీసులు ఈ సాంకేతికతను వాడతారు. అయితే దీనిని దుర్వినియోగం చేసే అవకాశముందని నిపుణులు చాలా కాలం నుంచి హెచ్చరిస్తున్నారు. తాజాగా ఆఫ్రో-అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఉదంతంతో ఈ సాంకేతికత ఉపయోగం మళ్లీ చర్చనీయాంశమైంది. ఈ తరుణంలో అమెజాన్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.