తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం... 8 మంది సజీవ దహనం

అమెరికా స్కాట్స్​బోరోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తెనెస్సీ నదీతీరంలోని డాక్​ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

alabama-fire-chief-confirms-8-deaths-in-boat-dock-blaze
అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం... 8 మంది సజీవదహనం

By

Published : Jan 28, 2020, 5:02 AM IST

Updated : Feb 28, 2020, 5:37 AM IST

అమెరికా స్కాట్స్​బోరోలోని తెనెస్సీ నదీతీరంలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక డాక్ యార్డులో మంటలు చెలరేగి ఎనిమిది మంది అగ్నికి ఆహుతైపోయారు. దాదాపు 35 పడవలకు వ్యాపించిన మంటల్లో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ ప్రస్తుతం ఆసుపత్రితో చికిత్స పొందుతున్నారు.

ప్రాణభయంతో దూకేశారు...

ఉవ్వెత్తున ఎగిసిపడిన అగ్నికీలల నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొందరు నదిలోకి దూకారని స్కాట్స్​బోరో అగ్నిమాపక సిబ్బంది ప్రధానాధికారి జీనే నెక్లాస్​ తెలిపారు. వీరి ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉందన్నారు. అలాగే ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది ఉన్నారో స్పష్టత లేనందున మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ప్రకటించారు.

15-20నిమిషాల్లోనే...

మంటలు చెలరేగిన 15-20 నిమిషాల్లోనే రేవు సమీప ప్రాంతమంతా అగ్నిజ్వాలల్లో చిక్కుకుపోయిందని.. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న మాండీ దుర్హమ్​ అనే ప్రయాణికురాలు పేర్కొన్నారు. పడవల్లో ఉన్న ప్రొపేన్​ వాయు ట్యాంకులే భారీ అగ్నిప్రమాదానికి కారణమయ్యాయని తెలిపారు.

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం... 8 మంది సజీవదహనం

ఇదీ చూడండి:వణుకుపుట్టించే చలిలో గుర్రపు పోటీల మజా!

Last Updated : Feb 28, 2020, 5:37 AM IST

ABOUT THE AUTHOR

...view details